
ఇకపోతే IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 25లో భాగంగా జరిగిన 30వ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు లక్నోను 5 వికెట్ల తేడాతో ఓడించి ప్రస్తుత సీజన్లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వరుసగా 5 మ్యాచ్ ల్లో ఓడిన తర్వాత సీఎస్కే జట్టు తిరిగి గెలుపు బాటలో పయనించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ దాని సొంత మైదానంలో ఓడించడం ద్వారా సీఎస్కే గత ఏడాది తన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మ్యాచ్ ఫినిషర్ పాత్రను చాలా చక్కగా పోషించాడు. 11 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి జట్టుకు ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించడంలో కీలకపాత్రని పోషించాడు. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విధంగా ప్రస్తుత సీజన్ లో ఏడో మ్యాచ్ లో సీఎస్కే తన రెండో విజయాన్ని నమోదు చేసింది.