
5 సంవత్సరాలు కిందటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ 2024 సంవత్సరం తొలి అర్ధభాగంలో ఎన్నో యాడ్స్ లో నటించాడు. ధోని తర్వాత సినిమాలని నిర్మించడం కూడా చేసాడు. ఈ క్రమంలోనే ధోని నటుడిగా మారబోతున్నాడా? అనే వార్తలు మీడియాలో సర్కిల్ కొడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ఓ వీడియోని షేర్ చేయగా, ఇందులో ధోని నటించబోతున్నాడు, ఓ కొత్త రొమాంటిక్ అవతారంలో కనపడనున్నట్టు స్పష్టం చేసాడు. వీడియోలో ధోని హార్ట్ సింబల్ బెలూన్ పట్టుకొని కనపడ్డాడు. ఆ వీడియో చూసిన తర్వాత ధోని హీరోగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? అనే అనుమానాలు సోషల్ మీడియా జనాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో ఈ వీడియో ఒక యాడ్ కోసం, ఆ యాడ్ ని కరణ్ జోహార్ డైరెక్ట్ చేస్తాడేమో అని కొందరు కామెంట్ చేస్తున్నారు. దాంతో ధోనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఈ స్పెషల్ వీడియో ధోని యాడ్ కోసమా? బాలీవుడ్ ఎంట్రీ కోసమా? అనేది ఇంకా తెలియాల్సి వుంది. అతని అభిమానులు మాత్రం ధోని సినిమా తెరమీద కనబడితే పండగ చేసుకోవాలని ఆశ పడుతున్నారు. అయితే వారి ఆశలు నిజమవుతాయా లేదంటే అడియాశలు అవుతాయా అనేది ఇంకా తెలియాల్సి వుంది. ధోని ఇప్పుడు సీఎస్కేకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల పరాజయాల తరువాత లక్నో సూపర్ జెయింట్స్‌పై వచ్చిన ఈ గెలుపు ధోనీ అద్భుత ప్రదర్శన కారణంగా సాధ్యమైంది.