అవును, ఆశ్చర్యంగా వున్నా... మీరు విన్నది అక్షరాలా నిజం. ఓకే ఓవర్లో 11 బంతులు వేశాడు. అతగాడు మరెవరో కాదు, సందీప్ శర్మ. చండీగఢ్ మరియు IPLలో రాజస్థాన్ రాయల్స్ తరపున దేశీయ క్రికెట్ ఆడుతున్న సందీప్ శర్మ అంటే అభిమానులకు మంచి గురి. శర్మ రెండు అండర్-19 ప్రపంచ కప్‌ (2010 మరియు 2012)లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. 2012 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత అండర్-19 జట్టులో సందీప్ కీలక సభ్యుడు. అతను యార్కర్లను బౌలింగ్ చేయడంలోను, బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉండడం వలన మంచి పేరు సంపాదించాడు.

అసలు విషయంలోకి వెళితే... ఐపీఎల్ 25 సీజ‌న్‌లో ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ టీంలు తెగ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే 5 సార్లు కప్పులు కొట్టిన జట్లు ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌ ఏరకంగా చతికల పడ్డాయో తెలిసిందే. మన హోం జట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కూడా పరాజయాలను ఎదుర్కొంది. ఇక తాజాగా జరుగుతున్న ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ చెత్త రికార్డు నమోదు చేసి, అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 11 బంతులు వేశాడు. నాలుగు వైడ్లు, ఒక నోబాల్ సహా 11 బాల్స్ వేసి చెత్త రికార్డు సృష్టించడంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే ఇలా ఒకే ఓవర్ కి ఎక్కువ బాల్స్ వేసిన వారు లేకపోలేదు... నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జరిగిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ల‌క్నో 4 ప‌రుగు స్పల్ప తేడాతో విజయ ఢంకా మోగించింది. కానీ.. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఒక ఓవ‌ర్‌లో 11 బంతుల‌ను వేసి మరో చెత్త రికార్డు సృష్టించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఓవ‌ర్‌ను వేసిన శార్దూల్ ఠాకూర్.. ఏకంగా 5 వైడ్లు వేశాడు. మొత్తంగా 11 బంతుల‌తో ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవ‌ర్ వేసిన బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. గతంలో ఈ రికార్డులు ఏ బౌలర్ల మీద ఉన్నాయో చూద్దాం..

తుషార్ దేశ్‌పాండే (చెన్నై సూప‌ర్ కింగ్స్‌) – 2023లో ల‌క్నోపై 11 బంతులు
మ‌హ్మద్ సిరాజ్ (రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు) – 2023లో ముంబై పై 11 బంతులు
శార్దూల్ ఠాకూర్ (ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌) – 2025లో కోల్‌క‌తా పై 11 బంతులు

మరింత సమాచారం తెలుసుకోండి: