భారతదేశంలో ఐపీఎల్ పండుగలా సాగుతోంది. ప్రపంచమంతా కళ్లప్పగించి చూస్తోంది. రోజుకు కోట్లాది మంది వీక్షిస్తున్నారు. ఆటగాళ్లను కోట్లకు కోట్లు పెట్టి కొంటున్నారు. ప్రైజ్ మనీ గురించి చెప్పనక్కర్లేదు. ఇదంతా చూసి పాకిస్తాన్‌కు కడుపు మంట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో పాక్ క్రికెట్ బోర్డు తీరు చూస్తే అర్థమవుతుంది.

ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్‌ఎల్) అని ఒకటి పెట్టారు. కానీ అది ఇప్పుడు నవ్వుల పాలైంది. ఎందుకంటే అక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఇంగ్లాండ్ ఆటగాడు అద్భుతంగా ఆడితే హెయిర్ డ్రయర్ గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇంకొక ఆటగాడికి ట్రిమ్మర్ ఇచ్చారట. స్కూల్లో పిల్లలకు పాటల పోటీలు పెట్టినా దీనికంటే మంచి బహుమతులు ఇస్తారు. ఇది అంతర్జాతీయ క్రికెట్ లీగ్‌ అంట. భారత్‌కు పోటీ అంట.

ఒకప్పుడు పులి వేటాడితే కడుపు నిండా తిని వదిలేస్తే, ఆ తర్వాత నక్క వచ్చి ఆ ఎంగిలి మెతుకులు తింటుంది. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐపీఎల్ ఒక రేంజ్‌లో ఉంది. కానీ పీఎస్‌ఎల్ మాత్రం హెయిర్ డ్రయర్లు, ట్రిమ్మర్ల దగ్గరే ఆగిపోయింది. వీళ్లను చూసి జాలి పడాలో లేక నవ్వుకోవాలో అర్థం కావడం లేదు. ఇలాంటి అవార్డులు పెట్టి పరువు తీసుకుంటున్నారు. ప్రపంచమంతా పీఎస్‌ఎల్‌ను చూసి నవ్వుకుంటోంది. ఇంకా సిగ్గు తెచ్చుకుని ఐపీఎల్‌ను చూసి కాస్త నేర్చుకుంటే మంచిది.

మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) లో బాబర్ ఆజమ్ ఆట సరిగ్గా లేకపోవడంతో, మాజీ ఆటగాడు బాసిత్ అలీ, విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోమని చెప్పాడు. PSL లో పెషావర్ జల్మి జట్టుకు నాయకత్వం వహిస్తున్న బాబర్, అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా పరుగులు చేయడానికి కష్టపడుతున్నాడు.

2023లో నేపాల్‌పై 151 పరుగులు చేసిన తర్వాత, అతను పాకిస్తాన్ తరపున ఇంకా సెంచరీ చేయలేదు. అతని ఫామ్ లేకపోవడం వల్ల జట్టును నడిపించే విధానం కూడా బాలేదు. బాబర్ కెప్టెన్‌గా ఉండగా, జల్మి జట్టు వరుసగా రెండు ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: