
ఈ మ్యాచ్ కు ముందు వరకు రోహిత్ పెద్దగా పరుగులు చేయలేక తీవ్రంగా నిరాశపరిచాడు. అతని మునుపటి స్కోర్లు చూస్తే... 0, 8, 13, 17, 18, 26గా ఉన్నాయి. అతని ఫామ్ పై అభిమానులు, విశ్లేషకులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, ఈ ఇన్నింగ్స్ తో తన ఫామ్ ను తిరిగి అందుకున్నాడు. ఒక మంచి ఆరంభాన్ని పెద్ద స్కోరుగా మలిచాడు. ఈ నాటౌట్ ఇన్నింగ్స్ లో రోహిత్ 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు బాదాడు.
ఈ అద్భుత ప్రదర్శనకు రోహిత్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇది IPL లో రోహిత్ కు 20వ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు. దీంతో, 19 అవార్డులతో ఉన్న విరాట్ కోహ్లీని రోహిత్ అధిగమించాడు. IPL లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితా చూస్తే, ఏబీ డివిలియర్స్ 25, క్రిస్ గేల్ 22, రోహిత్ శర్మ 20, విరాట్ కోహ్లీ 19, డేవిడ్ వార్నర్ 18, ఎంఎస్ ధోనీ 18.
మ్యాచ్ అనంతరం తన ఫామ్ పై రోహిత్ స్పందించాడు. పరుగులు రానప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో చెప్పాడు. “చాలా కాలం క్రికెట్ ఆడుతున్నప్పుడు, పరుగులు చేయనప్పుడు స్వీయ సందేహాలు రావడం సహజం. కానీ, నేను ప్రాక్టీస్ పై, బంతిని సరిగ్గా కొట్టడం పైనే దృష్టి పెట్టాను. మనసు స్పష్టంగా ఉంటే, మంచి విషయాలు జరుగుతాయి” అన్నాడు.
భయపడకూడదని రోహిత్ నొక్కి చెప్పాడు. “మీరు మిమ్మల్ని మీరు సందేహించుకుంటే, ఒత్తిడి పెరుగుతుంది. నేను ప్రశాంతంగా ఉండి, నా షాట్లు ఆడాలనుకున్నాను, నా బ్యాలెన్స్ ను కాపాడుకోవాలనుకున్నాను” అని తెలిపాడు. ఈ ఇన్నింగ్స్ రోహిత్ పై వస్తున్న విమర్శకులకు సరైన సమాధానం. అలాగే, ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న అవుతున్న ముంబై ఇండియన్స్ కు ఇది చాలా పెద్ద బూస్ట్ ఇచ్చింది.