ఇషాన్ కిషన్ గురించి దేశ క్రీడాభిమానులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇషాన్ టీమిండియా జట్టు తరపున 18 జూలై 2021న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్ డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. కాగా ఆయన IPL (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి కూడా విదితమే. ఆయన ఎస్ఆర్‌హెచ్ తరపున మార్చి 23న తొలి మ్యాచ్‌ ఆడి 47 బంతుల్లో 106 (11 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి తన తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేసి వారెవ్వా అనిపించాడు.

ఇకపోతే... రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా, ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా 41వ మ్యాచ్ హైదరాబాద్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి బక్కబోర్లా పడింది. అయితే, ఈ మ్యాచ్‌ జరిగే సమయంలో ఇషాన్ కిషన్ వికెట్ విషయంలో వివాదం చెలరేగుతోంది.

విషయం ఏమిటంటే? నిజానికి దీపక్ చాహర్ వేసిన బంతికి ఎటువంటి అప్పీల్ లేకుండానే అంపైర్ ఇషాన్ కిషన్‌ను ఔట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఇషాన్ కిషన్ కూడా అంపైర్ నిర్ణయాన్ని తూచా పాటిస్తూ పెవిలియన్‌కు వెళ్ళిపోయాడు. ఇషాన్ కనీసం రివ్యూ కూడా తీసుకోలేదు. దాంతో ఇషాన్ కిషన్ అమ్ముడు పోయాడని, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని పలువురు సోషల్ మీడియాలో చర్చకు తెర లేపారు. ఎందుకంటే? ఇషాన్ కిషన్ కీపర్ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. అతని బ్యాట్ బంతిని తాకిందో లేదో కూడా అతను గమనించలేదు. దాంతోనే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇషాన్ కిషన్ ఇంతకీ ముంబై తరఫున ఆడుతున్నాడా? అనే ప్రశ్న వస్తోంది. ఐదు ఛాంపియన్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ జట్టుతో తన ఐపీఎల్ కెరీర్ ను ప్రారంభించిన ఇషాన్ కిషన్ ఇంకా ముంబై తరపున ఆడుతున్నాడా? అని అతడిని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: