ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ సీజన్‌ 2025ను పరమ చెత్తగా ప్రారంభించడంతో సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అన్ని విమర్శలకీ ముంబై ఇండియన్స్‌ ధీటుగా సమాధానం చెప్పింది. మొదట చాలా పేలవమైన ఆటని ప్రదర్శించిన ముంబై ఇండియన్స్‌ తరువాత తరువాత గాడిలో పడింది. తొలి 5 మ్యాచ్‌ల్లో వరుస 4 పరాజయాల తర్వాత వరుసగా 4 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకొచ్చింది. అయితే ఈ జట్టుకు పడి లేవడం కొత్త కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే తొలుత పరాజయాలు ఎదుర్కొని ఆ తర్వాత టైటిల్‌ రేసులో నిల్చొని సత్తాచాటేది.

సరిగ్గా అదే విధంగా ప్రస్తుత సీజన్‌లో కూడా ముంబై ఇండియన్స్‌ అదే పరంపర కొనసాగిస్తోంది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ విఫలం అయిన సంగతి తెలిసిందే. దాంతో  కావడం.. రోహిత్‌ శర్మపై ఎంతోమంది విమర్శలు గుప్పించారు. అదే సమయంలో బ్యాటర్లు ఆత్య విశ్వాసం కోల్పోవడం, బుమ్రా అందుబాటులో లేకపోవడం వంటివి ముంబై కి బాగా దెబ్బతిశాయి. దాంతోనే తొలి మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం సీన్‌ రివర్స్ అయింది. రోహిత్‌ శర్మ తిరిగి సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. బుమ్రా జట్టులో చేరడమే కాకుండా, సామర్థ్యం మేరకు సత్తా చాటుడుతున్నాడు. బ్యాటర్లు, పేసర్లు దూసుకుపోతున్నారు.

ఇకపోతే, నిన్న (ఏప్రిల్‌ 23) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు ఇరగదీసారు. ఈ సీజన్‌లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించడం ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. నిన్నటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ముంబై.. ఆ జట్టును స్వల్ప స్కోర్‌కే పరిమతం చేసింది. పేసర్లు బౌల్ట్‌, చాహర్‌ చెలరేగడంతో సన్‌రైజర్స్‌ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేయడానికి నానా యాతన పడింది. క్లాసెన్‌ (71), అభినవ్‌ మనోహర్‌ (43) ఆదుకోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. బౌల్ట్‌ 4, చాహర్‌ 2, బుమ్రా, హార్దిక్‌ తలో వికెట్‌ తీసి సన్‌రైజర్స్‌ పుట్టి ముంచారు. అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్‌ (11) వికెట్‌ కోల్పోయినా.. రోహిత్‌ (46 బంతుల్లో 70).. విల్‌ జాక్స్‌తో (22) పాటు ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఆ సీజన్‌లో ముంబై వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అదే ముంబై ఇండియన్స్‌ను చివరి (ఐదో) టైటిల్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

mi