![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/61/kohli-water-bottle-415x250.jpg)
ఓ వాటర్ బాటిల్ ఖరీదు ఎంత ఉంటుంది. ఇరవై రూపాయలు. ఇంకా క్వాలిటీ అయితే ఓ 50 రూపాయలు.. కానీ సెలబ్రెటీలు తాగే వాటర్ బాటిల్ ఖరీదు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఇండియాలో టాప్ ఆదాయం ఉన్న ఆటగాడు విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా..?
విరాట్ కోహ్లీ ఈవియన్ బ్రాండ్ వాటర్ మాత్రమే తాగుతాడట. ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన బ్రాండ్లలో ఒకటి. ఒక్క బాటిల్ ఖరీదు అక్షరాలా 1440 రూపాయలు. అవును మరి క్రికెటర్లు నిత్యం ఫిట్ గా ఉండాలి. నీటితోనే చాలావరకూ వ్యాధులు వచ్చే అవకాశం ఉండటం వల్ల అలాంటి ఖరీదైన వాటర్ తాగడం కోహ్లీ లాంటి వారికి తప్పనిసరి.
ఇంతకీ ఈ ఈవియన్ బ్రాండ్ వాటర్ ప్రత్యేకత ఏంటో తెలుసా.. ఇది స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ మధ్య ప్రవహించే ఇవియాన్ లెన్ బైన్స్ అనే ప్రాంతంలని జెనీవా సరస్సు నుంచి ఈ నీటిని సేకరిస్తారట. ఇక్కడి నీళ్లలో ఖనిజ లవణాలు, మెడికల్ క్వాలిటీస్ చాలా ఎక్కువట.
ఈవియన్ తో పాటు అక్వాఫినా, మౌంటెన్ వ్యాలీ, స్మార్ట్ వాటర్, ఫిజి, దాసని, వాస్, ప్యూర్ లైఫ్ వంటి బ్రాండ్లు టాప్ ర్యాంకుల్లో ఉన్నాయి. ఇక ఈవియన్ కంపెనీ తన వాటర్‌ను భౌగోళిక అద్భుతంగా వర్ణిస్తుంది.