కొన్ని కొన్ని సీరియల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.. ఆ సీరియల్స్ మన తెలుగు సీరియల్స్ ఆ? హిందీ సీరియల్స్ ఆ అనేది ఏమి ఉండదు.. సీరియల్స్ అంతే.. అలా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ మనం ప్రతి సారి చూడలేము.. కానీ కొన్ని సార్లు చూస్తాం.. అలా చుసిన సీరియల్స్ ఎప్పటికి మర్చిపోలేం.. 

 

ఎలా అంటే? అప్పట్లో అన్వేషణ, పంచతంత్రం, చక్రవాకం, రాధా మధు, మొగలి రేకులు.. ఈ సీరియల్స్ అన్ని కూడా మన తెలుగు సీరియల్స్ ఎలా అవుతాయో.. అలానే దుబ్బింగ్ సీరియల్స్ కూడా మన బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్నాయి.. అందులో మొదటి ప్లేస్ లోనే ఉంది ఏంటి అంటే? చూపులు కలిసిన శుభవేళ, ఆతర్వాత ఈతరం ఇల్లాలు, చిన్నారి పెళ్లికూతురు, కోడలా కోడలా కొడుకు పెళ్ళామా. 

 

ఇలా సీరియల్స్ అన్ని కూడా డబ్బింగ్ అయ్యాయి.. ఇంకా అలా డబ్ అయినా సీరియల్ మీరొకటి కూడా మన బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ సీరియల్ ఏంటి అంటే? మనసు పలికే మౌనగీతం. కొత్తగా ఓ స్టోరీ లైన్ తీసుకొని ప్రారంభించిన ఈ సీరియల్ హిందీలోనూ తెలుగులో మంచి టీఆర్పీ సొంతం చేసుకుంది.. 

 

తక్కువ రోజులు ప్రసారం అయినప్పటికీ మంచి పేరు సొంతం చేసుకుంది ఈ సీరియల్. ఎందుకంటే పిల్లలు, రెండో పెళ్లి, అంత కొత్తగా ఉండేది.. సవతి తల్లి కూడా బిడ్డను అంత ప్రేమగా చూసుకుండే వ్యక్తి ఆ సీరియల్ లో హీరోయిన్ యేనేమో.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది.. ఈ సీరియల్ చూడటానికి. అలాంటి ఈ సీరియల్ ని మీరు కూడా చూశారా?                                           

మరింత సమాచారం తెలుసుకోండి: