జబర్దస్త్ హాస్యనటుడు సాయి తేజ సర్జరీ చేయించుకొని పూర్తి అమ్మాయి గా మారి ప్రియాంక సింగ్ అనే పేరు పెట్టుకొని తెలుగు ప్రేక్షకులందరిని ఆశ్చర్య పరిచాడు. జబర్దస్త్ షోలో రచ్చ రవి చమ్మక్ చంద్ర స్కిట్లలో తరచుగా నటించిన సాయి తేజ ఆడ వేషం వేస్తే నిజమైన ఆడవారి కంటే అందంగా కనిపించే వాడు. ఇతడి అందానికి జబర్దస్త్ షో కి గెస్ట్స్ గా వచ్చిన బడా హీరోలే ఎవరీ అమ్మాయి ఇంత బాగుంది అంటూ ఫ్లాట్ అయిపోయారంటే సాయి తేజ అందం ముందు హీరోయిన్లు కూడా పనికిరారని తెలుస్తోంది.


నిజానికి సాయి తేజ పుట్టుకతోనే అబ్బాయి అయినప్పటికీ... అతను మాత్రం ఎప్పుడూ అమ్మాయిలతోనే సమయం గడిపేవాడు. వారిలాగానే ప్రవర్తించేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన అక్కయ్య లంగా వోణి, అమ్మ చీర వేసుకుని తెగ సంతోష పడేవాడు. అతను పెద్దవాడు అయిన తర్వాత అదృష్టవశాత్తు సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ కామెడీ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ లో అవకాశం దక్కించుకున్నాడు. అయితే తాను ఎప్పుడూ ఆడవేషం లోనే కనిపించేవాడు. అప్పుడే తనకు ఆడపిల్లగా మారాలని బాగా ఆలోచనలు వచ్చేవి.జబర్దస్త్ లో నటించడం వలన డబ్బులు చేతులారా సంపాదించిన సాయి తేజ అమ్మాయి గా మారాలి అనే తన చిరకాల కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఇంట్లో చెప్తే తన తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోరని ఊహించిన సాయి తేజ వారేవరికీ చెప్పకుండా లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ఆడపిల్ల గా మారారు. 


తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు తెలిపారు. మీరు ఆకస్మాత్తుగా ఆడపిల్లగా ఎందుకు మారాలనుకున్నారని ప్రశ్నించినప్పుడు... 22 ఏళ్ల లో లింగ మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆ సమయంలో సర్జరీ చేయించుకున్నాను. లింగ మార్పిడి సర్జరీ అనేది ఎంత క్లిష్టతరమైన, ప్రమాదకరమైనదని అయినా నేను ఏమీ ఆలోచించలేదు. నాకు ఆడపిల్ల అవ్వాలని ఉంది. సాయి తేజ లాగా, ఒక మగ వ్యక్తులాగా ఎక్కువకాలం నటించలేకపోయాను. అందుకే ఆడపిల్లలాగా మారిపోయాను. లింగమార్పిడి సర్జరీ మూడు రోజుల్లో పూర్తి అయిపోయింది' అని చెప్పుకొచ్చింది ప్రియాంక అలియాస్ సాయి తేజ. 


ఆపరేషన్ ఖర్చుల మీరు సొంతంగా సంపాదించిన డబ్బుతోనే భరించా రా అని ఇంటర్వ్యూ ప్రియాంక ని అడిగితే... అవునండీ నేను సొంతంగా సంపాదించుకున్న డబ్బులతోనే ఆపరేషన్ ఖర్చులు భరించాను. కానీ ఆపరేషన్ కి ఎన్ని డబ్బులు పెట్టడం అనేది మాత్రం నేను చెప్పలేను. అవన్నీ సీక్రెట్స్. కానీ ఆపరేషన్ ఖర్చుల లక్షల్లో అయ్యాయని చెప్పగలను', అని ప్రియాంక సింగ్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: