సూపర్ స్టార్ మహేష్ బాబు ని వదలని హైపర్ ఆది..!బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతున్న షో ఢీ. సీజన్లు మారుతున్న కొద్దీ డాన్స్ తోపాటు మంచి కామెడీని కూడా పుట్టిస్తున్నారు. అయితే ఏ షోకి ప్రదీప్ యాంకర్ గా చేస్తున్నాడు. రెండు టీమ్స్ కి అది, వర్షిణి, సుధీర్, రష్మీ టీం లీడర్స్ గా ఉన్నారు. ఈ షోకి శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.

 

 

అయితే ఈ సెట్ లో ఎప్పుడు ఎవర్నో ఒకర్ని ఇమిటేట్ చేసి.. ఏదో రకంగా పంచ్‌లు వేసి.. యాస ప్రాసలతో పాపులర్ కావడం హైపర్ ఆది స్పెషాలిటీ. అయితే మెగాస్టార్ చిరంజీవి మొదలు నందమూరి బాలయ్య వరకూ అందరి హీరోలను ఇమిటేట్ చేస్తూ స్కిట్స్ చేస్తుంటాడు హైపర్ ఆది. అయితే వీటిని ఫన్నీగా రిసీవ్ చేసుకునే అభిమానులు కొందరైతే సీరియస్ వార్నింగ్‌లు ఇచ్చేవారు ఇంకొందరు. ఎవరు ఏం అనుకున్నా.. తిట్టినా, పొగిడినా తన ఇమిటేషన్ పంథాలో ముందుకు పోతున్నాడు హైపర్ ఆది.

 

 

అయితే ఢీ ఛాంపియన్స్’ ప్రోమోలో సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇమిటేట్ చేశాడు హైపర్ ఆది. అంతేకాదు సుధీర్, వర్షిణి, ప్రదీప్, రష్మిలతో కలిసి చేసిన రచ్చ మామూలుగా లేదండీ. కేక పుట్టించే డాన్స్ పెర్ఫామెన్స్‌తో ఈ ప్రోమో ప్రారంభం చేసి నాలుగున్నర నిమిషాల పాటు ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్ టైన్ చేసింది.

 

 

ఈ షోలో ముఖ్యంగా యాంకర్ ప్రదీప్.. సుధీర్‌పై వేసిన పంచ్‌లు బాగా పేలాయి. నా పేరు దయ నాకు లేనిదే అది అంటూ సుడిగాలి సుధీర్ జూనియర్ ఎన్టీఆర్ మాదిరి బిల్డప్‌ని హైప్ చేసే ఎంట్రీ ఇవ్వగా.. నాకు తెలుసు, నీ పేరు కక్కుర్తి నీకు ఉన్నదే అది అంటూ పంచ్ పేల్చాడు ప్రదీప్. వీరిద్దరి మధ్య జోక్‌లు పేలుతుండగా.. ‘జగడమే..’ అంటూ పోకిరిలో మహేష్ బాబులా పరుగుపెడుతూ ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. అయితే చివర్లో సుధీర్ వర్షిణితో చేసిన ‘దేవతా దేవతా’ రొమాంటిక్ సాంగ్ ప్రోమోలో హైలైట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: