ఇదిలా ఉంటే ఇప్పుడు "డీ" షో లో తాజాగా ప్రదీప్ పూర్ణ ట్రాక్ కూడా మొదలు అయ్యింది.. దీనితో రేటింగ్ ఇంకా పెరిగిపోయింది.. అయితే ఇక పూర్ణ గతంలో తన తోటి జడ్జిలు ఎలా వుంటారు…. ఎలా ప్రవర్తిస్తారో ఇమిటేట్ చేసి చూపించింది. శేఖర్ మాస్టర్ ను అయితే అచ్చు గుద్దినట్లు పక్కాగా దించేసింది. తర్వాత రష్మిని సైతం యాజ్ టీజ్ గా దించేసింది అంతే. సేమ్ రష్మీ లాగానే చేసింది. ఇదే క్రమంలో ఆమె హైపర్ ఆదిని కూడా ఇమిటేట్ చేసింది. డీ షో లో హైపర్ ఆదిని ఎప్పుడన్నా గమనించారా.. !! డాన్స్ చేస్తున్నప్పుడు,హైపర్ ఆది ముఖ్యంగా అమ్మాయిలను చూస్తాడట.
అయితే పూర్ణ కూడా అతను ఎలా లేడీ డాన్సర్లను తీక్షణంగా చూస్తాడు….ముఖంలో ఎటువంటి హావభావాలు పెడతాడు అని చేసి చూపించింది. దీంతో డీ షో లో ఉన్న అందరూ పగలబడి తెగ నవ్వారు. పూర్ణ ఆదిని ఇమిటేట్ చేస్తుంటే హైపర్ ఆది కూడా తెగ నవ్వేసాడు. పూర్ణ హైపర్ ఆదిలా యాక్ట్ చేసి, ఆదిలో ఉన్న మరో యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసేసిందిగా... !! మరి ఆదికి అమ్మాయిల విషయంలో ఇంతా కక్కుర్తి బుద్ది ఉందా అనే అనుమానం కలుగుతుంది కదా..!