బిగ్ బాస్ లో ఇప్పుడు సరి కొత్త గేమ్ లు.. సరికొత్త గొడవలు.. ఇలా చూసుకుంటే ఇప్పుడు మిడ్ నైట్ మసాలా సినిమాలను మించిన రేంజులో ఉంటున్నాయి.దాంతో యువత నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకేదైనా చూపిస్తుందా అని ఆశతో చూస్తున్నారు. ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది.. కానీ నోయల్ ఆరోగ్యం సహకరించలేదు.. ఇతను పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక ఎలిమినేషన్ లో ఎవరున్నారు అనేది వారం చివరిలో చూడాల్సిందే..



అయితే ఇప్పుడు హౌస్ లో కొందరికి అభిజిత్ హీరో అయ్యాడు.. మరి కొందరి దృష్టిలో జీరో అయ్యాడు..సినిమాలలో బాగానే రాణించిన ఈ హీరో షో విషయానికొస్తే ఏదో ఉండాలిగా అన్నట్లు ఉన్నాడు..మాటల్లో మగాడంటే పులిలా ఉండాలి అంటారు.. పులి ఏమి చేస్తుంది.. గర్జిస్తుందా లేదు ఆకలి తీర్చుకోవడానికి వెయిట్ చేస్తోంది. అలాంటిది నేను కూడా వెయిట్ చేస్తున్నా అంటూ ఏవేవో అన్నాడు.. ప్రస్తుతం అవి కాస్త వైరల్ అవుతున్నాయి.



అరేయ్ నా ముందు మాట్లాడరా.. బయటకు వచ్చి మాట్లాడరా అంటే అది పులితనం మగతనం కాదు.. అసలు దాన్ని పులి అనే అనరు. నువ్ సైలెంట్‌గా ఉండి వెయిట్ చేస్తే చాలు నీకు కావాల్సిన ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి. నువ్ ప్రతిదాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి.. గ్రూప్ డిస్కషన్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. నాకు మోనాల్ ఎక్స్ పీరియన్స్‌తో బాగా అర్థమైంది అంటూ తాను హీరో అన్నట్లు మిగిలిన వాళ్ళు జీరో అన్నట్లు వ్యవహరించారు. వెయిట్ చేయడం బాగానే ఉంది కానీ ఇన్ని ఎపిసోడ్స్ అయినా వెయిట్ చేయడం అంటే ఏదోలా ఉంది. టైటిల్ కాస్త వేరే వాళ్ళ చేతికి పోతుంది.. అంటూ నెటిజన్లు నోటికి పని చెప్పారు.. మరి అభిజిత్ ఎలా సేవ్ అవుతాడో మున్ముందు ఎపిసోడ్ లలో చూడాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: