అయితే గత మూడేళ్లుగా కార్తీకదీపం సీరియల్ హీరోగా డాక్టర్ బాబు పాత్రతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. నిరుపమ్ రూపాన్నే కాదు.. అతని స్వరాన్ని ఇష్టపడే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. తన క్యారెక్టర్‌కి తనే డబ్బింగ్ ఇచ్చుకుంటూ ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు నిరుపమ్. ఈ సీరియల్ మొత్తం ప్రేమాభిమానాలను ఎలా పొందాలి అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. తల్లి ప్రేమ, భార్య, ప్రియురాలు, బిడ్డలు వీళ్ళ మద్య రెండు పాత్రలు తిరుగుతాయి..
నటనకు జీవం పోసేలా డబ్బింగ్ ఇవ్వడం మరో ఎత్తు. అయితే గత 10 రోజులులా ఆ స్వరం వినిపించడం లేదు. డాక్టర్ బాబు క్యారెక్టర్‌కి వేరే వాయిస్ వినిపిస్తోంది. ప్రేక్షకులకు అలవాటైన స్వరం కాకుండా వేరే వాయిస్ వినిపిస్తుండటంతో అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. అతను ఇప్పటి వరకు నటించిన సీరియల్స్ అన్నిటికీ అతనే సొంతంగా వాయిస్ చెప్పాడు..ప్రస్తుతం అతను నటించిన ఏ సీరియల్ లోనూ అతను వాయిస్ వినిపించలేదు.. వేరే వాయిస్ తో డబ్బింగ్ వినపడుతుంది. అయితే ఇప్పుడు బోర్ కొడుతుందని, వాయిస్ సింక్ అవ్వలేదు అని అంటున్నారు. దీంతో షో రేటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. మూడు నాలుగు సీరియల్స్ కు అతనే డబ్బింగ్ చెప్తున్నాడు. కానీ అతనికి ఏదైనా అనారోగ్య సమస్య ఉందా లేదా పూర్తిగా డబ్బింగ్ చెప్పడం మానేసాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నిరూపమ్ వాయిస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఇప్పుడు ఆ వాయిస్ వినపదకపోవడంతో సీరియల్స్ చూడటం దగ్గించారు. చూద్దాం ముందు వినిస్తుందేమో..