నిన్నటి నుంచి జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. హౌస్ మొత్తంలో ఒక్క అవినాష్ తప్పితే.. మిగిలిన ఇంటి సభ్యులంతా అరియానాని నామినేట్ చేశారు. వీరితో పాటు మోనాల్, అభిజిత్, మెహబూబ్, హారిక, సోహైల్‌లు నామినేషన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.కెప్టెన్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. ఫిజికల్ టాస్క్ అంటే అభిజిత్ ఎలాగూ దూరంగానే ఉంటూ వస్తాడు.. ఇక్కడ కూడా ఏదో ఆలోచన చేశాడా అని బుర్ర గొక్కుంటున్నారు నెటిజన్లు..
ఇది ఇలా ఉండగా ... ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ఈవారం కెప్టెన్ పోటీదారుల ఎంపిక కోసం చర్చ నడుస్తుండగా.. టాస్క్‌లో గెలిచిన వాళ్లలో ఎవరు కెప్టెన్ పోటీదారుడిగా ఉండాలో తేల్చుకోండని బిగ్ బాస్ ఫిటింగ్ పెట్టడంతో.. అఖిల్ ఫ్రెండ్ ఫిష్.. దోస్త్ మేరా దోస్త్ అంటూ సొహైల్, మెహబూబ్‌లను కన్వెన్స్ చేసేపనిలో పడ్డాడు.అలా ఒకరి మీద మరొకరు నోరు పారేసుకున్నారు.. మెహబూబ్.. ‘నా దరిద్రం ఎలా ఉంది అంటే.. ప్రతిసారీ దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి తీసేకుంటున్నాడు’ అంటూ తెగ ఏడ్చేస్తున్నాడు. పక్కనే ఉన్న మోనాల్ ఈసారి మెహబూబ్‌తో ఓదార్పు యాత్ర చేపట్టింది.... దీంతో చిర్రెత్తుకొచ్చిన బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్ ఉండడు అని తేల్చి చెప్పాడు.. ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది.. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే...