లాస్య భర్త శేఖర్ డబ్బుల కోసం తనను వేధిస్తూ ఉంటాడు.. అంతేకాదు ఏకంగా ఇంటికే వస్తాడు..అది చూసిన తులసి లాస్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది..నిన్నటి ఎపిసోడ్ లో అశ్విన్ తో శృతి తండ్రి శృతి జాడ తెలియడం లేదని చెప్పి బాధపడతారు..నాకు తెలుసు బాబు నువ్వు నా కూతుర్ని ఎంతగా ప్రేమించావో.. తనకోసం ఎంత కుమిలిపోతున్నావో’ అంటూ కంటతడి పెట్టుకుంటాడు. ఇంతలో అశ్విన్‌కి కాల్ రావడంతో అలా పక్కకు వెళ్తాడు..అప్పుడే వందన శృతి తండ్రిని కలిసి పరామర్శిస్తుంది..వందనని చూసి అనుమానంగా చూస్తాడు అశ్విన్. దాంతో వందన అశ్విన్‌కి భయపడుతూ.. ‘సరే అంకుల్ జాగ్రత్తగా ఉండండి. అంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది..
ఇకపోతే వందనని భయపెట్టడం తో శృతి ఎక్కడుందో నిజాన్ని చెప్పేస్తుంది.. ఆ తర్వాత అశ్విన్ శృతి ఉన్న ఇంటికి వెళ్ళిపోతాడు ...ఆ విషయాన్ని గమనించిన శృతి, ప్రేమ్ లు తాళం వేసి , ఇంటి ఓనర్ కు అపద్దం చెప్పమని అంటారు. దాంతో అతని ఇల్లు ఖాళీ చేసినట్లు చెబుతారు.అశ్విన్ నిరుత్సాహంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దాంతో సృతి ఊపిరి పీల్చుకుంటుంది. ప్రేమ్‌కి థాంక్స్ చెబుతుంది. మొత్తానికి ప్రేమ్ ఇంటికి వెళ్లేదాకా తులసి మెలుకువగానే ఉంటుంది.. ఇంట్లో తులసి ఏదో చెప్పి మ్యానేజ్ చేస్తాడు.. అలా ఆ ఎపిసోడ్ ముగిస్తుంది.. ఈరోజు ఏం జరగబోతుందో చూడాలి..