తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం కి ఉన్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు ..సెపరేట్ గా కార్తీక దీపం సీరియల్ కి ఫ్యాన్ ఉండటమే కాకూండా అందులో నటించిన వంటలక్క కి ఒక రేంజ్ లో ఫ్యాన్ ఉన్నారు అంటే నమ్మగల .. వచ్చిన ఒక్క సీరియల్ తోనే సెలెబ్రెటీ అయినా వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ..

రాత్రి  ఏడున్నర అయ్యిందంటే  తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో  కార్తీకదీపం సీరియల్ ప్రసారం అవుతుంటాయి.. తెలుగు సీరియల్ చరిత్రలోనే ఏ సీరియల్ కి  రాని విధంగా ఈ  కార్తీకదీపం సీరియల్ అధిక రేటింగ్ లను సొంతం చేసుకుంటుంది. నిజం చెప్పాలంటే కార్తీకదీపం సీరియల్ మలయాళ  మాతృక కరసముత్తు  రీమేక్..   కథా కథనాలు రొటీన్ గానే  అనిపించినా అందులో నటించే పాత్రలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా ప్రేమి విశ్వనాథ్ ప్రజల మనసుల్ని దోచేసింది ఇక నిరుపమ్ , హిమ మరియు శౌర్య,  సౌందర్యాల పాత్రల నటులు  అద్భుతంగా నటించడం కారణంగా కార్తీకదీపం సీరియల్ బాగా హిట్ అయ్యింది ..  ఇక ఈ సీరియల్ లో ని ప్రముఖ పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాధ్  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ప్రేమి విశ్వనాథ్ మలయాళం సీరియల్ కరసముత్తు  ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది ..  అటు  తర్వాత తెలుగులో అదే సీరియల్  కార్తీకదీపం  తో రీమేక్ అవడంతో తో ప్రేమి విశ్వనాధ్ ఇందులోనూ  చేయడంతో బాగా ఫేమస్ అయ్యింది..

ఇక సీరియల్ కి  వస్తున్న ఆదరణ చూసి ప్రేమి విశ్వనాథ్ సినిమాల్లో కూడా చేయడానికి ఆసక్తి చూపుతుంది.. ప్రేమి విశ్వనాథ్ సీరియల్ లో నటించడమే కాకుండా పలు గేమ్ షోలకు కూడా హోస్ట్ గా కూడా వ్యవహరించింది.. అలాగే పలు యాడ్స్ లో కూడా ప్రేమి విశ్వనాథ్ నటిస్తోంది. ఇక ప్రేమి విశ్వనాథ్ ఆదాయం గురించి చూస్తే ఆమె సుమారు ఆదాయం మొత్తం కలిపి 36 కోట్ల రూపాయలు ఉండొచ్చని తెలుస్తోంది.. సీరియల్ లోనే నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ సినిమా హీరోయిన్ల స్థాయిలో  ఆస్తులను సంపాదించడం విశేషం.. ఇక ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ లో నటించేందుకు ఒక్కరోజుకి 20 వేల  పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం అందుతుంది..

ఇక  ప్రేమి విశ్వనాథ్ కి  ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టమట ఆమె సీరియల్ లోకి రాకముందు పెళ్లిళ్లకు ఫోటోలు తీసేవారు సీరియళ్లలో నటించడంతో పాటు ప్రేమి విశ్వనాథ్ సొంతంగా ఒక ట్రావెల్ ఏజెన్సీ ని కూడా నడుపుతుండడటం విశేషం ..ఇదండీ ప్రేమి విశ్వనాధ్ స్టోరీ ..  వంటలక్క లాగా మన జీవితంలోకి ప్రవేశించిన ప్రేమి విశ్వనాథ్ సినిమాలలో నటించే హీరోయిన్  తరహాలో  ప్రేక్షక అభిమానులను సంపాదించుకుంది.. ఇక ప్రేమి విశ్వనాథ్ నటన చూసిన కొందరు నిర్మాతలు సినిమాల్లో అవకాశాలను కూడా ఇవ్వనున్నారు. ఇక బుల్లితెరపై నటించిన ప్రేమి విశ్వనాథ్ సినిమా తెరపై కూడా అతి త్వరలో రాబోతున్నట్లు అర్థం అవుతుంది.. చేసిన ఒక సీరియల్ లోనే అంతటి ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్ మున్ముందు  ఇంకా మంచి సీరియల్స్ చేయాలని మనసారా కోరుకుందాం ..

మరింత సమాచారం తెలుసుకోండి: