అయితే ఈమె తర్వాత యాంకర్లుగా మంచి కెరియర్ ను అందుకున్న వారిలో భార్గవి, కలర్స్ స్వాతిలు ఉన్నారు. వీరిరువురి మధ్యన అప్పట్లో గట్టి పోటే ఉండేది. కాని యాంకర్ గా శ్రీముఖిలు, రష్మిలు ఎంట్రీ ఇవ్వడంతో భార్గవి యాంకరింగ్ కు పుల్ స్టాప్ పడిందనే చెప్పుకోవచ్చు. అయితే యాంకరింగ్ చేయకపోయినా ఈమె చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించింది. కాగా తాజాగా భార్గవి యాంకర్ గా ఉన్నప్పుడు ఆమె జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పింది. అందులో యాంకర్ గా ప్రస్తుతం మాంచి ఫాం లో ఉన్న అనసూయ గురించి ఆశ్చర్యకరమైన విషయాలను వెళ్లడించింది భార్గవి. నాకు యాంకరింగ్ అంటే ఎంతో ఇష్టం. కాని నాకిష్టమైన ఆ ఫీల్డ్ లో ఉండలేకపోయాను. ఎందుకంటే మా ఆయన ఆర్మీ ఆఫీసర్. మా ఆయనకు రెండేళ్లకొకసారి ట్రాన్సఫర్ అయ్యేది. దాంతో నేను యాంకరింగ్ కు దూరంగా ఉన్నాను. ఒకరకంగా చెప్పాలంటే ఇండియా అంతా తిరిగాం. పిల్లలు పుట్టడం.. ఫ్యామిలీ వర్క్స్ వల్ల నేను యాంకరింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ యాంకరింగ్ కు దూరంగా ఉన్నన్ని రోజులు నా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశాను. అలాగే అవకాశం వచ్చినప్పుుడల్లా సినిమాల్లో నటించాను.
కేవలం నేను హైదరాబాద్ లో లేకపోవడం మూలంగానే నేను చాలా ఆఫర్లను పోగొట్టుకున్నాను. లేకుంటే నన్ను పిలిచేవారు. నేను యాంకరింగ్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడే కలర్స్ స్వాతి కూడా అప్పుడే వచ్చింది. ఆమె నాకంటే చిన్నదే అయినా ఇద్దరం ఒకటే సారి ఎంట్రీ ఇవ్వడం మూలంగా మా ఇద్దరి మధ్యనే పోటీ ఉండేది. మేము వచ్చేటప్పటికే సుమ, ఝాన్సీ, ఉదయభాను యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరికి నేను ఎప్పుడు పోటీ అనుకోలేదు. కలర్స్ స్వాతి నేను క్లోజ్ గా ఉండే వాళ్లం. మేము వచ్చిన కొన్ని రోజులకే మధుషాలిని, ప్రశాంతి, రష్మి లు వచ్చి మాతో కలిసి డ్రీమ్స్ గర్ల్స్ చేసింది. నాకు రష్మి ఎంతో అందంగా కనిపించింది. ఆ తర్వాత అనసూయ వచ్చింది. నాకు ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు.. నేను ఆ సమయంలో బిజీగా ఉన్నప్పుడు అనసూయకు చెప్పేదాన్ని.. నాకు వచ్చిన ఈవెంట్ ను ఆమెకు ఇచ్చేదాన్ని. ఇలా మనం బిజీగా ఉన్నప్పుడు వేరే యాంకర్లకు చెప్పడం నాకు నాకంటే ముందొచ్చిన యాంకర్లు చెప్పారు. అందుకే నేను బిజీగా ఉంటే అలా అనసూయకు చెప్పేదాన్ని.. నేను అవకాశం ఇచ్చిన అనసూయ ఇప్పుడు టాప్ యాంకర్ గా మారడం సంతోషంగా ఉంది. ఎంతైనా టాలెంట్ ఉన్నావాళ్లు ఎప్పటికీ ఓడిపోరు అనేది నేను నమ్ముతానని సీనియర్ యాంకర్ భార్గవి తెలిపారు.