తెలుగులో సుడిగాడు
సినిమా తో ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ మోనాల్ పేరు చాలా మందికి తెలియదు. ఒకటో, రెండో సినిమాలతో
గుజరాత్ కు వెళ్ళిపోయింది. ఇటీవల మా టీవిలో టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన
రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఈ అమ్మడు పాల్గొంది. తన అందాలను ప్రేక్షకులకు చూపించే నేపథ్యంలో అందరి చేత చివాట్లు తిన్నది. అంతేకాదు రొమాన్స్ కు మొహం వాచినదానిలా ఈమె ప్రవర్తన ఉండటంతో అందరూ విమర్శలు కురిపించారు. అవే ఇప్పుడు అమ్మడును టాప్ రేంజు లో కూర్చోబెట్టింది. ఇప్పుడు వరుస
సినిమా లలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
అంతేకాదు పలు
టీవీ షో లకు హోస్ట్ గా కూడా చేస్తుంది.. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మోనాల్ మరోసారి తెలుగు వాళ్ళ నుంచి ఘాటు విమర్శలు అందుకుంటుంది. ఎవరైనా రాముడు లాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటారు. మీరేంటి శ్రీకృష్ణుడు లాంటి
భర్త కావాలని అంటున్నారు అని తిరిగి ప్రశ్నించగా.. దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మోనాల్.తనకు శ్రీరాముడు అంటే నచ్చడని.. సీతను అనుమానించి అడవులకు పంపాడు.. ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి సీతను అడవులు పాలు చేశాడు అందుకు నాకు రాముడంటే ఇష్టం ఉండదు.. శ్రీకృష్ణుడు అంటేనే ఇష్టం అని చెప్పింది. అంతటితో ఆగకుండా.. ఒకవేళ రాముడు కనుక తనకు కనిపిస్తే ఎందుకు సీతను అడవుల పాలు చేశావని అడుగుతాను.
ఇన్ని రోజులు తనతో
ఉన్నావ్ తానేంటో నీకు తెలియదా అంటూ ప్రశ్నిస్తాని ఆమె అన్నది. రామ భక్తులు మోనాల్‌ని ఓ రేంజ్‌లో ఉతికి ఆరేస్తున్నారు. బిగ్ బాస్‌లో కనిపించేసరికి రాముడిని ప్రశ్నించేటంత గొప్పదానికి అయిపోయావా?? అసలు రాముడు గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావ్..? రాముడి గురించి మాట్లాడంటే
అర్హత ఉండాలి. నీకు ఏ
అర్హత ఉందని మాట్లాడుతున్నావ్.. అంటూ రామ భక్తులు మోనాల్‌పై ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఆ నోటా ఈ నోటా వినపడటంతో వైరల్ అవుతుంది.