బాలీవుడ్, కోలీవుడ్ ఇలా తదితర భాషల్లో బిగ్ బాస్ ఎంతో ఫాస్ట్ గా దూసుకెళ్లిపోతుండగా తెలుగులో ఐదో సీజన్ త్వరలో రానుందని తెలియగానే అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.. ఇప్పటివరకు నాలుగు సీజన్లలో మేల్ కంటస్టెంట్ లు విజేత గా నిలిచారు.. ఈసారి అయినా ఫిమేల్ కంటస్టెంట్ గెలుస్తుందా అని చూస్తున్నారు. అందుకు తగ్గట్లే బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న అందమైన సెలెబ్రిటీలను దించుతున్నారట..
సీజన్ 4 లాక్ డౌన్ వల్ల ఆలస్యం కావడంతో సీజన్ 5 ను త్వరగా మొదలు పెట్టనున్నారు.ఈ విధంగా సీజన్ 5 లో పాల్గొనే కంటెస్టెంట్ లో ఇటీవలే యాంకర్ రవి, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది లను తీసుకోనున్నట్లు వార్తలు వినిపించాయి.అంతేకాకుండా యూట్యూబ్ లో వెబ్ సిరీస్ ద్వారా మంచి స్టార్ గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనున్నట్లు తెలుస్తున్నాయి.ఇక డీ షో లో పాల్గొన్న బ్యూటీ వర్షిణి, టిక్ టాక్ ఫేమస్ పొందిన దీపిక కూడా సీజన్ 5 లో తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది.ఇలా చాలా మంది సెలబ్రెటీలను బిగ్ బాస్ షో లలో ఎంచుకొని.వారిని ప్రత్యేక గుర్తింపును అందుకునేలా చేస్తుంది.ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయిన తర్వాత.బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్ వాళ్లని ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ షో జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో ప్రసారం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.