బిగ్ బాస్ షో లో శివజ్యోతికి కొత్త కొత్త స్నేహితులు ఏర్పడ్డారు. బిగ్ బాస్ అయి పోయిన తర్వాత కూడా ఈ స్నేహం కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా అలీ రెజా కి, శివజ్యోతికి మధ్య అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది. శివజ్యోతి ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా.. అలీ రెజా తన భార్యతో వస్తుంటాడు. ఫిబ్రవరి 14న శివజ్యోతి పుట్టిన రోజు. ఆమె బర్త్ డేను అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. బాగా ఎంజాయ్ చేశారు. అలీ రెజా ఈ వేడుకలకు ఆలస్యంగా వచ్చాడు. ఇదే సమయంలో శివజ్యోతిని అలీ ఆశీర్వదించాడు.
అయితే శివజ్యోతికి అలీ చెప్పిన విషెస్, షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఆయన మాటలను బట్టి శివజ్యోతి తల్లికాబోతుందనే విషయం స్పష్టమవుతోంది. మనం ఓ తల్లి కడుపున పుట్టకపోయినా.. మన ఇద్దరి ఆత్మలు ఒకటే అని నమ్ముతాను. హ్యాపీ బర్త్ డే అక్కా .. నీకు మరిన్ని సంతోషాలు రావాలని కోరుకుంటున్నాను. విజయాలు దక్కాలని కోరుకుంటున్నా. అంతేకాదు త్వరలోనే ఓ బేబీ వస్తుందని ఆశిస్తున్నానంటూ అలీ శివజ్యోతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. దీన్ని బట్టి శివజ్యోతి తల్లి కాబోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నో కష్టాలు పడి చివరకి ఈ స్థితికి చేరుుకున్నశివజ్యోతి.. ఇప్పుడు తల్లికాబోతుందనే వార్త సంతోషం నింపింది. తనకష్టంతో ఓ ఇల్లు, కారు కొనుక్కున్న శివజ్యోతి.. తల్లి కాబోతుందనే వార్త అందరికీ సంతోషాన్నిస్తుంది. ఆమె ఇంట్లో సందడి మొదలైంది. శివజ్యోతి తల్లి కాబోతుందా.. అని ఆమె అభిమానులు వెరిఫై చేసుకుంటున్నారు. ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.