జూనియర్ వెండి తెర మీదే కాదు బుల్లి తెరపై కూడా తన హవాను కొనసాగించారు..గతంలో వచ్చిన కొన్ని షో లు తారక్ కు మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి. కాగా, మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో ప్రసారం అయ్యే ఈ గేమ్‌ షో ఇండియాలో 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' అనే పేరుతో హిందీలో ప్రారంభం అయింది. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ వచ్చింది.మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో ప్రసారం అయింది. ఇప్పుడీ మరో సీజన్‌తో రెడీ అయింది. తాజాగా ఈ షోకు సంబంధించిన కొత్త ప్రోమోను విడుదల చేశారు.


ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని భాషల్లో మాదిరిగానే మన దగ్గర కూడా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇందులో మొదటి మూడింటికీ అక్కినేని నాగార్జున.. నాలుగో దానికి మెగాస్టార్ చిరంజీవి హోస్టులుగా చేశారు.మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో నాలుగు సీజన్లు స్టార్ మా చానెల్‌లో ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీని ద్వారా సదరు చానెల్‌కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చింది. అప్పట్లో ఇదే నెంబర్ వన్ గేమ్ షోగా ఉండేది. కానీ, అక్కడితోనే దీని ప్రస్థానం ఆగిపోయింది. ఇక, ఈ సారి ఈ గేమ్ షో జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది. దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు..


అయితే , ఈ షో ప్రోమో ను రిలీజ్ చేశారు. కేవలం ఒక కుర్చీ అందులో కనిపిస్తుంది. హోస్ట్ గా ఏ స్టార్ హీరో చేయబోతున్నాడు.మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ పేరు ఖాయమైందని వార్తలు కూడా మరో వైపు సంచణలంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో వారంలో ఐదు రోజులు ప్రసారం అవుతుందని తెలుస్తోంది. మొత్తం 60 ఎపిసోడ్లు ఈ షో నడుస్తుందని సమాచారం. ప్రతి రోజూ రాత్రి 9 గంటల నుంచి 10.30 గంటలకు ఇది ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఉంటుందని టాక్... ఏ మాత్రం హిట్ అవుతుందనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: