యాంకర్ సుమ.. అని అనడం కన్నా ..సుమక్క అంటే చిన్న పిల్లాడు కూడా ఇట్టే చెప్పేస్తాడు.. స్వతహాగా మలయాళీ అయిన కూడా తెలుగులో యాంకర్ కొనసాగుతుంది. సుమ చేసే ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సూపర్ హిట్ అవ్వాల్సిందే..సినిమా ఫంక్షన్లకు , టెలివిజన్ రియాలిటీ షోలకు హోస్ట్‌గా బిజీగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె నిర్వహించే స్టార్ట్ మ్యూజిక్ కార్యక్రమంలో సమీర్, జబర్దస్త్ చంటీతో చేసిన హంగామ ఎలా ఉందంటే..రచ్చ రంబొలా అనే చెప్పాలి.


టెలివిజన్ చరిత్రలో తనకంటూ ఒక పేజ్ ను క్రియేట్ చేసుకుంది.తన ప్రతిభతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. ఈటీవీ, స్టార్ మా, జెమినీ లాంటి ఛానెల్స్‌లో గేమ్ షోలు, రియాలిటీ షోలను సుదీర్ఘంగా కొనసాగిస్తున్నారు. తాజాగా స్టార్ మాలో స్టార్ట్ మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరింతగా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు..అసలు విషయానికొస్తే.. స్టార్ మా లో సుమ హోస్ట్ గా చేస్తున్న షో స్టార్ మ్యూజిక్ తాజా ఎపిసోడ్‌లో నటుడు సమీర్, జబర్దస్త్ ఫేం చలాకీ చంటి, నల్లవేణు, ధన్ రాజ్, జ్యోతి షో కు హైలెట్ అయ్యారు.


ఇక ఇలాంటి ముదుర్లు కలిస్తే హస్యం ఎలా పండుతుందో మాటల్లో చెప్పనక్కర్లేదు. సమీర్ వేసిన పంచ్ డైలాగ్స్ చెలరేగిన సుమ.. సమీర్‌ను వెంటాడి గట్టిగానే బాదింది.. షోలో ఇది మెయిన్ హైలెట్ అయ్యింది.ఇంతలో చందమామ రావే అంటూ చలాకీ చంటీ పాట అందుకొంటే ఏదో సైగ చేయబోయాడు. ఏంటి చంటీ.. రమ్మని అలాగా సైగ చేస్తారా అంటూ సుమ నిలదీసింది. దాంతో రావొద్దనే విధంగా సైగ చేస్తూ.. ఇలాగే మా ఇంట్లో పిలుస్తారు అంటూ సుమకు సమాధానం ఇచ్చాడు. మొత్తానికి ఆదివారం షో రచ్చ రచ్చగా సాగింది. సుమకు ఇలాంటి విషయాల్లో ఎవరు పోటీ రారని చెప్పాలి..వచ్చే వారం ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: