దీప మొండి తనం వల్ల డాక్టర్ బాబు మరింత ఆవేశానికి గురవుతారు..వేడి దగ్గరకు వెళితే తను బ్రతకడం కష్టం అని డాక్టర్లు తేల్చి చెప్పారు..డాక్టర్ కార్తీక్, అత్త సౌందర్యలో ఆందోళన పెరిగిపోయింది. తన ఆరోగ్యం ఎంత దారుణంగా ఉంటుందనే విషయం తెలియక దీప వంటగదిలోకి దూరి వంటలు చేయడం మొదలుపెట్టింది. దాంతో దీపపై కార్తీక్ తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు..దీప అలియాస్ వంటలక్క మొండిగా వ్యవహరించడంపై డాక్టర్ కార్తీక్ ఘాటుగా స్పందించారు. దీపను ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పు మమ్మీ.
టిఫిన్లే కాకుండా లంచ్, డిన్నర్ అన్నీ చేయమను. ఇంకా తృప్తి తీరకపోతే.. టిఫిన్ బాక్సులు కొనిస్తా.. డబ్బావాలా మాదిరిగా ఆఫీసుల్లో వేయమని చెప్పు అంటూ కార్తీక్ ఘాటుగా స్పందించారు.. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు..నేనంటే ఆయనకు ఇష్టం లేదు. అంత మాత్రాన ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నేనంటే గిట్టడం లేదు. ఎందుకు నరకం చూపిస్తున్నారు అంటూ దీప ఆవేశంగా తన వాదనను వినిపించారు. అయితే దీప మాటలకు అడ్డుపడుతూ.. ఆపు ఇక నీ మాటలు.. నరకం నేను చూపిచడం లేదు. నీవే చూపిస్తున్నావు. నీ పంతమే నిన్ను.. నిన్ను అంటూ తన భాదను చెప్పతున్నప్పుడు సౌందర్య అడ్డుకుంటుంది.. ఇలా ఎపిసోడ్ మొత్తం రసవత్తరంగా మారింది.. కార్తిక్ కోపాన్ని దీప చల్లారుస్తుందా లేదా అన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలియాల్సి ఉంది..