సాధారణంగా వెండితెరపై స్టార్ పొజిషన్ ను అనుభవిస్తున్న ఎంతోమంది హీరో హీరోయిన్లు ఎంతవరకు చదువుకున్నారు, అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి వారి అభిమానులలో ఉండటం సహజం.. అయితే చాలా వరకు వెండితెరపై నటిస్తున్న హీరోలు మాత్రం తక్కువ చదువుకొని, సినీ రంగంలో మాత్రం స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల బుల్లితెర పై నటిస్తున్న హీరోలు కూడా ఎంతవరకు చదువుకున్నారు అనే విషయాలను తమ అభిమానులు తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. అయితే బుల్లి తెరపై నటిస్తున్న హీరోలు ఎంతవరకు చదువుకున్నారు ? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
అప్పటితో పోల్చుకుంటే ఇప్పట్లో వెండితెరతో సమానంగా బుల్లితెర హీరోలు కూడా ప్రేక్షకుల ఆదరణ అందుకుంటున్న విషయం, అంత ఆషామాషీ కాదు. ఇందులో చాలా మంది ఉన్నత చదువులు చదువుకున్న తర్వాతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వారిలో ముఖ్యంగా చందు గౌడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఇక ఆ తరువాత నిరుపమ్ పరిటాల ఎంబీఏ పూర్తి చేశాడు. శ్రీరామ్ వెంకట్ బీఎస్సీ చదివాడు.
అలాగే గోకుల్ బీటెక్ చదవగా, కల్కి రాజా ఎంబీఏ పూర్తి చేశాడు. ఇక అర్జున్ ఎంసీఏ పూర్తి చేశాడు. రవి కృష్ణ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, మధుబాబు బిటెక్ కంప్లీట్ చేశాడు. ఇక నిఖిల్ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు వాడు. జై ధనుష్ బి.ఏ పూర్తి చేయగా , వీజే సన్నీ కూడా బిఎస్సి కంప్లీట్ చేశాడు.
ఇలా ఎంతోమంది బుల్లి తెరపై నటిస్తున్న హీరోలు ఉన్నత చదువులు చదివి, బుల్లితెర ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివిన వీళ్లు, నటనా రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ, కేవలం నటన మీద ఉన్న ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి , వెండితెరపై స్టార్ హీరోలకు సమానంగా వీరు కూడా అంతే స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వెండితెర హీరోల కంటే బుల్లితెర హీరోలకే అభిమానులు ఎక్కువగా వున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.