ఈటీవీ ప్లస్ లో ఒకప్పుడు ప్రసారమయిన పటాస్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు బుల్లి తెరకు పరిచయం అయ్యారు. తమ నటనతో, డైలాగులతో, ప్రత్యేకమైన పంచులతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న వీరు జబర్దస్త్ టీం లోకి చేరిపోయారు. అలా చేరిన వారిలో నూకరాజు కూడా ఒకరు. ఈయన తన చిన్న వయసులోనే కమెడియన్ గా  అవతారమెత్తాడు. ఇప్పుడు ప్రత్యేకమైన షో లు చేసుకుంటూ బిజీ లైఫ్ లో ఆనందిస్తున్నాడు. అయితే ఈ షో లో వారు పడిన కష్టాలను తెలుపుతూ అందరినీ ఏడిపించాడు. అయితే పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం..

అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు సంపాదించిన నూకరాజు జబర్దస్త్ షో ద్వారా తక్కువ సమయంలోనే సెకండ్ లీడర్ గా ఎదిగారు. అందులో అనేక రకాలైన గెటప్ ల ద్వారా హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నాడు. తద్వారా ఇతని ఫాలోయింగ్ కూడా బాగా  పెరిగిపోయింది.


అయితే ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే "శ్రీదేవి డ్రామా కంపెనీ"షో కొత్తగా ప్రసారమవుతున్న విషయం  మనకి తెలిసిందే. దీనికి యాంకర్ గా సుడిగాలి సుదీర్ చేస్తున్నాడు. జబర్దస్త్ కామెడీ షో లో ఉండే వారు అందరూ ఇందులో కూడా ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో నూకరాజు హైలెట్ గా నిలిచాడు. నూకరాజు కమెడియన్ మాత్రమే కాదు సందర్భానికి తగిన ఎక్స్ప్రెషన్ లు ఇవ్వడంలో నూకరాజు మించి మరొకరు లేరు. ఇక తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్నారు.


అయితే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ లో నూకరాజు పాల్గొని అమ్మ మీద  ఒక పాట పాడి అందర్నీ ఏడిపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే , ముఖ్యంగా ఈ కరోనా సమయంలోనే కాకుండా  సాధారణ పరిస్థితులలో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఏ విధమైన పనులు చేస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ షోలో నూకరాజు కూడా ఇదే పాత్రను పోషించి అందరి మన్ననలు పొందాడు. ఇక ఇందులో మరొక విశేషం ఏమిటంటే ముక్కు మూసుకొని మరీ భోజనం చేస్తూ వాళ్ళు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారో కళ్ళకు కట్టినట్లు చూపించారు నూకరాజు.



మరింత సమాచారం తెలుసుకోండి: