అయితే సుడిగాలి సుధీర్ టీమ్ పై ఎప్పుడూ ఏదో ఒక నెగిటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. అందులో ఎక్కువగా"గెటప్ శీను, రాంప్రసాద్ వల్లే సుడిగాలి సుధీర్ టీం నడుస్తోందని, ఇందులో సుధీర్ నటన తక్కువగా ఉంటుందని ప్రేక్షకులు కామెంట్ చేస్తూ ఉన్నారు.
స్క్రిప్ట్ పరంగా రాంప్రసాద్ పంచుల వేసి స్కిట్లు ముందుకు తీసుకు వెళుతుంటే.. గెటప్ శీను తనదైన శైలిలో అనేక పాత్రలు వేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక మరికొంతమంది ఆలోచన ఏమిటంటే.. కష్టపడేది మాత్రం రాంప్రసాద్ ,గెటప్ శ్రీను ..కాని క్రెడిట్ మాత్రం సుదీర్ తీసుకుంటున్నాడు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా సుధీర్ ఫాలోయింగ్ ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు సుడిగాలి సుధీర్ అంటే అటు బుల్లితెర పైన ఇటు వెండితెరపైన కూడా మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి.
సుధీర్ టాలెంట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. మ్యాజిక్ చేయడంలో సుధీర్ కి మించిన వ్యక్తి మరొకరు లేరు. నవ్వించగలడు.. ఏడిపించగలడు.. మ్యాజిక్ చేసి మాయ చేయగలరు. డాన్స్ కూడా అదిరిపోయే స్టెప్పులు తో అందరినీ అలరిస్తూ ఉంటాడు. అంతేకాదు యాక్షన్ లోనూ, పాటలలోనూ, యాంకరింగ్ లోనూ ఇలా అన్నింటిలోనూ సుధీర్ కు మంచి ప్రావీణ్యం ఉంది.. అయితే ఇటీవల ఒక ఈ విషయంపై.. మీ టీం కు లీడర్ గా వ్యవహరిస్తున్న సుధీర్ ఇంతకు ఆ పోస్టుకి అర్హుడేనా అని అడిగాడు. అందుకు సమాధానంగా గెటప్ శ్రీను ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది..
టీం లీడర్ గా సుధీర్ కి మాత్రమే అర్హత ఉంది. మరెవ్వరికీ లేదు..అని సమాధానం ఇస్తూనే, మరో నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సుధీర్ జాన్ జిగ్రీ లాంటివాడు..అంటూ ఎమోజీ లను షేర్ చేశాడు.