సుమ బుల్లితెరపై అడుగుపెట్టక ముందే వెండితెరపై అడుగు పెట్టి తన సత్తా ఏంటో చాటుకుంది. ఇక బుల్లి తెరపై అడుగుపెట్టి , దాదాపుగా రెండు దశాబ్దాలు దాటినప్పటికీ తన స్థానాన్ని చెక్కుచెదరనివ్వకుండా ఒక మహారాణిలా బుల్లితెర పై కొనసాగుతోంది. ఇక అంతే కాదు తన వాక్చాతుర్యంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా , చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సుమ అంటే విపరీతమైన అభిమానం కలిగి ఉంది. ప్రేక్షకాదరణ పొందిన సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేరళలో జన్మించిన సుమ, మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల ను వివాహం చేసుకొని తెలుగింటి కోడలు కొనసాగుతోంది..

ఇంతటి క్రేజ్ ను సంపాదించుకున్న సుమ, ఇటీవల తన తల్లిని ఆ విషయంలో ఫాలో అవుతున్నానంటూ తెలిపింది. ఇటీవల తన తల్లి గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చెబుతూ వస్తోంది. అంతే కాదు ఆమె తల్లి గారు చేసిన యోగాసనాలు గురించి కూడా ఒక వీడియో తీసి , సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆమె అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల తన తల్లి గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇంట్లో అంతా పండగ వాతావరణం నెలకొంది.

సాధారణంగా సుమ చిన్న వయసులో ఉన్నప్పుడు , తన పుట్టినరోజుకు సుమ వాళ్ళ అమ్మ సుమను గుడికి తీసుకువెళ్లి , ఆ తర్వాత ఎన్నో రకాల వంటలు వండి, సుమ ఫ్రెండ్స్ ని పిలిచి ఆతిథ్యం ఇచ్చేదట. అలా ఎన్నో సంవత్సరాల పాటు తన తల్లి తన పుట్టినరోజుకు చేసిన సంబరాలను , ఇప్పుడు సుమ తన  అమ్మ తల్లి కోసం ఉదయాన్నే లేచి, ఎన్నో రకాల వంటలను  కూడా తయారు చేసిందట. అంతే కాదు వాళ్ళ అమ్మగారిని గుడి కి తీసుకెళ్లి, ఆమె  స్నేహితులను కూడా ఇంటికి పిలిచి భోజనం వడ్డించింది సుమా. ఇక ఈ హడావిడి అంతా ఒక వీడియో లో బంధించి ,సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: