బుల్లితెరపై సుడిగాలి సుధీర్ పేరు వినగానే ప్రేక్షకులు ఎంతో సంబరపడి పోతారు. ఇక ఆయన చేసేటటువంటి కామెడీ షో వల్ల విపరీతంగా తన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈయన లో ఒక మెజీషియన్, ఒక డాన్సర్, ఒక యాక్టర్ ఇలా పలు రకాలైన కళలు వున్నాయి.ఇలా వాటితో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అయితే ఈయన ఒక ఇంటర్వ్యూలో తన ఆస్తి గురించి తెలియ జేశాడు.. ఆ వివరాలను చూద్దాం.

సుధీర్ సినిమాలో హీరోగానే కాకుండా, కొన్ని సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. ఇక ఇటీవల జరిగిన ఒక కామెడీ షో లో సుధీర్ తన ఆస్తుల గురించి తెలియజేశాడు. ఆ విషయాలు తెలుసుకున్న నెటిజన్లు చాలా ఆశ్చర్య పోతున్నారట. సుధీర్ కి ఇంత ఆస్తి ఉందా ..? అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారట. సుధీర్ మొదటి అవకాశాల కోసం హైదరాబాద్ కి వచ్చినప్పుడు.. అక్కడ అతనకి ఆశ్రయం లేకపోవడంతో రైల్వే స్టేషన్లు నిదురించేవాడట.

ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చిన సుధీర్, ప్రస్తుతం హైదరాబాదులో 2  సొంత ఇళ్లను నిర్మించుకున్నాడు. ఇక అంతే కాకుండా మరికొంత స్థిరాస్తి ఉన్నట్లు కూడా తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. ప్రస్తుతం పెద్దపెద్ద సిటీలలో ఒక ఇల్లు నిర్మించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటే, సుధీర్ అతి తక్కువ సమయంలో రెండు ఇల్లు నిర్మించడం అంటే ఆషామాషీ విషయం కాదు అని నెటిజన్లు  తెలియజేస్తున్నారు.

ఇక సుధీర్ అభిమానులు తన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇందుకు గాను మహేష్ బాబు పోకిరి సినిమాలో చెప్పిన డైలాగ్ ను కూడా సుధీర్ అభిమానులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా సుధీర్ లాంటి మల్టీ టాలెంటెడ్.. ఉన్న వ్యక్తి సినీ ఇండస్ట్రీ లో ఉండడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక వెండితెరపై, బుల్లితెరపై  తనకు ఇచ్చిన పాత్రను మెప్పించడం కోసం ఎంతో కష్టపడతాడు సుధీర్. అందుచేతనే ఆయన కి ఇంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: