
త్వరలోనే ఎక్స్ ట్రా జబర్దస్త్ 350 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో, ఇక ఈ షోలో ప్రతి ఒక్కరు తాము ఎలా కష్టపడ్డారు.. ప్రస్తుతం ఉన్నత స్థాయికి ఎదిగారు.. ఎలాంటి పరిణామాలను చవిచూశారు .. అనే విషయాలను కళ్లకు కట్టినట్టుగా స్కిట్ రూపంలో చూపించడం జరిగింది. ఇక ఒక స్కిట్ లో సుధీర్ పాత్రలో కార్తీక్, గెటప్ శీను పాత్రలో ఇమ్మాన్యుయేల్ నటించి, ఆ స్కిట్ లో సుధీర్ అలాగే గెటప్ శీను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఎలాంటి కష్టాలు పడ్డారు..? ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు..? తినడానికి తిండి లేక చేతిలో రూపాయి లేక , ప్లాట్ ఫామ్ మీద పడుకొని ఇలా ఎలాంటి పరిస్థితులను అనుభవించారు..అనే విషయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు.. ఇమ్మా న్యూయేల్ అలాగే కార్తీక్.
ఈ స్కిట్ మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి అని చెప్పవచ్చు. ఇక అంతే కాదు సుధీర్ కూడా తను పడిన కష్టాలను అన్నింటినీ గుర్తుతెచ్చుకొని, కన్నీటి పర్యంతమయ్యాడు. రష్మీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఏడుస్తూనే ఉంది. స్కిట్ అయిపోయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ లో కెవ్వు కార్తిక్ రష్మీ ను మీ అనుభవం ఏంటి..? రష్మీ అని అడగగా.. ఒక్కసారిగా ఆమె బోరున ఏడ్చేసింది. అంతేకాదు ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదని చెప్పవచ్చు.. ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల కావడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.