బిగ్ బాస్ సీజ‌న్-5 ఆదివారం ప్రారంభం కాగా సోమ‌వారం నామినేష‌న్స్ మొద‌ల‌య్యాయి. బిగ్ బాస్ సీజ‌న్ ఎప్పుడు ప్రారంభ‌మైంది అన్న దానితో సంబంధం లేకుండా ప్ర‌తి సోమ‌వారం నామినేష‌న్స్ జ‌ర‌గ‌టం బిగ్ బాస్ రూల్. గ‌త సీజ‌న్ లోనూ హౌస్ లోకి వ‌చ్చిన మ‌రుస‌టి రోజే నామినేష‌న్స్ మొద‌ల‌య్యాయి. దాంతో ఇంటి స‌భ్యులు అస‌లు ఒక్క రోజులో ఎలా నామినేట్ చేస్తాం అని మొండి చేసినా నామినేట్ చేయ‌క త‌ప్ప‌లేదు. ఇక ఈ సీజ‌న్ లో ఇంటి సభ్యులెవ‌రూ నామినేషన్ ప్ర‌క్రియ‌లో వెన‌క‌డుగు వేయ‌లేదు. రూల్స్ ముందే తెలుసుకున్నారో ఏమో కానీ నోరు మెద‌ప‌కుండా ఫ‌టా ఫ‌ట్ నామినేట్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇక నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో కంట‌తడి పెట్ట‌డాలు...వార్నింగ్ లు ఇచ్చుకోడాలు కూడా క‌నిపించాయి. 

మోడ‌ల్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన జ‌శ్వంత్ జెస్సీ క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం నిన్నటి ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో హ‌మీదా, జెస్సీ మ‌ధ్య వివాదం నెల‌కొంది. హ‌మీదా త‌న ఇంటి గురించి చెబుతూ త‌న ఇంట్లో ఓ పిల్లి ఉంద‌ని అది అన్ని పిల్లుల్లా మ్యావ్ అన‌కుండా మామ్..మా అని పిలుస్తుంద‌ని జెస్సీ, శ్వేత వ‌ర్మ‌ల‌కు చెప్పింది. అంతే కాకుండా త‌న వ‌ద్ద ఒక పెంపుడు కుక్క కూడా ఉంద‌ని చెప్పింది. దాంతో జెస్సీ స‌ర‌దాగా పిల్లి మామ్...మా అనిపిలుస్తే...కుక్క డాడీ అని పిలుస్తుందా అంటూ జోక్ పేల్చాడు. ఆ జోక్ కి హ‌మీదాకు కాలిపోయింది. హ‌ర్ట్ అయిన హ‌మీదా ఆ విష‌యాన్ని ఇంట్లో ఇత‌ర సభ్యుల‌కు చెప్ప‌డం జెస్సీ చూసాడు.

నేను స‌ర‌దాగా అన్నాన‌ని ఎందుకు అంద‌రికీ చెబుతున్నావంటూ సీరియ‌స్ గా సైగ చేసాడు. అలా సైగ చేయ‌డం విశ్వ చూసాడు. ఇక త‌న‌కు నామినేట్ చేసేందుకు ఓ రీజ‌న్ దొరికింద‌నుకున్న విశ్వ అదే రీజ‌న్ తో జెస్సీని నామినేట్ చేశాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెరిగింది. న‌న్ను నామినేట్ చేస్తావా అంటూ జెస్సీ కూడా హ‌మీదాను అలాగే విశ్వ‌ను నామినేట్ చేసేసాడు. ఆ త‌ర‌వాత న‌ట‌రాజ్ మాస్ట‌ర్ వ‌చ్చి నువ్వు అమాయ‌కుడివి ఈ హౌస్ లో ఉండ‌లేవంటూ జెస్సీని నామినేట్ చేశాడు. దాంతో ఫుల్ ఎమోష‌న‌ల్ అయిన జెస్సీ గుక్క పెట్టి ఏడ్వ‌టం మొద‌లు పెట్టాడు. త‌ర‌వాత లోబో, ప్రియా వ‌చ్చి ఓదార్చినా జెస్సీ త‌న ఎమోష‌న్ ను కంట్రోల్ చేసుకోలేక‌పోయాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: