ప్ర‌స్తుతం సిగ‌రెట్ తాగ‌టం..మ‌ద్యం సేవించ‌డం కామ‌న్. సినిమా ప్రారంభానికి ముందు కూడా సిగ‌రెట్లు తాగటం, మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని చెబుతుంటారు. కానీ చాలా మంది సినిమా తార‌లే సిగ‌రెట్ లు తాగ‌టం మద్యం సేవించ‌డం లాంటివి చేస్తుంటార‌ని బ‌య‌ట టాక్. ఇక ప‌లువురు ప్ర‌ముఖ హీర‌లు కూడా ఇంట‌ర్య్వూల‌లో త‌మ‌కు సిగ‌రెట్ అల‌వాటు ఉండేద‌ని కానీ ఎంతో క‌ష్ట‌ప‌డి సిగ‌రెట్ లు తాగ‌టం మానేశామ‌ని చెబుతుంటారు. మ‌రి కొంద‌రు సిగ‌రెట్ లు మానేయాల‌ని ఎంతో ప్ర‌య‌త్నించామ‌ని కానీ త‌మవ‌ల్ల కాలేద‌ని బాధ‌ప‌డుతుంటారు. సినిమా వాళ్లు సెల‌బ్రెటీ స్టేట‌స్ ఉన్న‌వాళ్లు ఏం చేసినా వాళ్ల‌ను అనుక‌రించేవాళ్లు ఉంటారు కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. 

అయితే బిగ్ బాస్ షోలో కూడా ప్ర‌తి సీజ‌న్ లో సిగ‌రెట్ లు తాగే బ్యాచ్ ఉంటుద‌న్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ మొద‌టి సీజ‌న్ లోనే సిగ‌రెట్ ల కోసం ఓ పెద్ద లొల్లి జ‌రింగింది. శివ‌బాలాజీ, ధ‌న్ రాజ్ లు సిగ‌రెట్ లు పంప‌డం లేదంటూ ర‌చ్చ రచ్చ చేశారు. ఇక వారికి త‌గ్గ‌ట్టుగా బిగ్ బాస్ కూడా సిగ‌రెట్ లు ఆపేయ‌డం కంటెంట్ కోసం వారు సిగ‌రెట్ల కోసం త‌హ‌త‌హ‌లాడుతారంటూ చూపించ‌డం జరిగింది. ఇక ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 5 లోనూ సిగ‌రెట్ ప్రియులు ఉన్న‌ట్టు నిన్న‌టి ఎపిసోడ్ లో క‌నిపించింది. బిగ్ బాస్ లో సిగ‌రెట్లు తాగొచ్చు కానీ ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తాగ‌కూడ‌ద‌ని ఓ రూల్ కూడా ఉంది. దాంతో దూమ‌పాన ప్రియులు అంతా ఓ రూమ్ లోకి చేరుకుని సిగ‌రెట్ తాగుతుంటారు.

నిన్న‌టి ఎపిసోడ్ లో లోబో తో పాటూ ఇద్ద‌రు లేడీ కంటెస్టెంట్ లు హ‌మీదా, సెవెన్ ఆర్ట్స్ స‌ర‌యు లు ద‌మ్ముకొట్టారు. దానికి సంబంధించిన వీడియోను బిగ్ బాస్ టెలికాస్ట్ చేశాడు. దాంతో స‌ర‌యు, హ‌మీదాల‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. స‌ర‌యు అంటే ఎలాగూ సెవెన్ ఆర్ట్స్ లో మాస్ మ‌హారాణి అనిపించుకునింది. కాబ‌ట్టి లైట్ తీసుకుంటున్నారు కానీ హ‌మీదా చూడ్డానికి ఇన్నోసెంట్ గా క‌నిపించి ద‌మ్ముకొడుతుండ‌టంతో ట్రోల్స్ చేస్తున్నారు. ద‌మ్ము కొట్ట‌డం ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవ‌ద్ద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. ఇక ద‌మ్ము కొట్టే మ‌గాళ్లు మాకు స‌ర‌యు..హ‌మీదా లాంటి పెళ్లామే కావాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: