ఎదో కావాలని చెప్పించినట్లుగా ఉంది. ఇక మొదటి వారం ఎండింగ్ టైం లో బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన నాగ్ కంటెస్టెంట్స్ తో క్యాట్ వాక్, మీకు హౌజ్ లో నచ్చిన వారు, నచ్చని వారు ఇలా పలు రకాల టాస్క్ లు చేయించి ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. అలాగే ఇంట్లో ప్రియాంక సింగ్ క్రష్ ఎవరంటూ నేరుగా అడిగేశారు. అందుకు అందరూ ఒక్కసారిగా ప్రియాంక క్రష్ శ్రీ రామ్ అని గోల గోల చేశారు. ఆ తర్వాత ప్రియాంక స్పందిస్తూ ఇలాంటి విషయాలు డైరెక్ట్ గా పబ్లిక్ లో చెప్పాలంటే ఎలా సార్ అంటూనే అసలు విషయం బయట పెట్టింది నా క్రష్ శ్రీ రామ్ అని చెప్పేసింది. అలాగే షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుతాడు అని నాగ్ అడుగగా అందుకు షణ్ముఖ్ ఎక్కువగా సిరి గురించి మాట్లాడుతారంటూ అన్నారు.
దానితో అందరూ సిరిని షణ్ముఖ్ ల మధ్య ఏదో నడుస్తోందన్నట్లుగా ముఖాలు పెట్టారు. కానీ ఇంతలియో సిరి అడ్డొస్తూ సార్ బయట మేము ఒకరికి ఒకరు తెలుసు. మేము మంచి ఫ్రిన్డ్స్ అంతే అంటూ సమాధానమిచ్చింది. దానితో ఆ కామెంట్ కు పుల్ స్టాప్ పడింది. ఈ ఎపిసోడ్ దీప్తి సునైనా కనుక చూసి ఉంటే ఖచ్చితంగా ఫీల్ అయి ఉండేది. ఎందుకంటే ఇప్పటికే షణ్ముఖ్ మరియు దీప్తి సునైనా లవ్ లో ఉన్నారు. అయితే దీనిపై అభిమానులు సైతం తమకు తోచినట్లుగా కామెంట్ చేస్తున్నారు. షణ్ముఖ్ అమాయకంగా నటిస్తూనే దీప్తి సునైనా కు అన్యాయం చేస్తున్నాడా అంటున్నారు.