అయితే ఆఫ్టర్ బిగ్ బాస్ మాత్రం ప్రతి తెలుగు ప్రేక్షకుడికి తెలుసు. ముక్కుసూటిగా వ్యవహరించే మనిషిగా, అనిపించింది అనిపించినట్లు కుండ బద్దలు కొట్టినట్టు తన మాటలతో స్పెషల్ గా కనిపించింది. హౌస్ నుండి వెళ్ళేటప్పుడు తనకు కౌంటర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించింది. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే బిగ్ బాస్ నుండి బయటకు వెళ్లిన సరయు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు రెడీ అవుతుందట. ఈ విషయం అలా ఉంచితే విమర్శల వర్మను తానే స్వయంగా ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం. తాజాగా ఈమెకు వర్మను ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించినట్లు తెలుస్తోంది.
సరయు కూడా ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని ఒకే చెప్పినట్లు చెబుతున్నారు. గతంలో బిగ్ బాస్ హాట్ బ్యూటీస్ అయిన అరియానా మరియు అషూ రెడ్డి లు వర్మ ఇంటర్వ్యు తో ఒక్కసారిగా ఇటు బుల్లి తెర అతి వెండి తెర ప్రముఖల అటెన్షన్ ను తమ వైపు తిప్పుకున్నారు. వర్మతో ఈ ఇరువురి భామల ఇంటర్వ్యూ లు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షో సీజన్ 3 లో అలరించిన అషూ రెడ్డి అలాగే సీజన్ 4 లో సందడి చేసిన అరియానా ఇద్దరు వర్మ ఇంటర్వ్యూ తో మరింత ఫేమస్ అయ్యారు. అయితే ఇపుడు నిజంగానే సరయుకి కూడా ఈ అవకాశం వచ్చిందా? త్వరలో వివాదాల వర్మను ఇంటర్వ్యూ చేయనుందా అంటే వేచి చూడాల్సిందే.