బిగ్ బాస్ సీజన్ 5 లో రచ్చ రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్ లు. . నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బోస్ పంతం నీదా నాదా అన్న టాస్క్ ను ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీం లు గా విడిపోయి గేమ్ ను ఆడాల్సి ఉంటుంది. చివరికి ఎవరి వద్ద అయితే డామేజ్ కాకుండా ఎక్కువ పిల్లోస్ అయితే ఉంటాయో వారే విజేతలు. కాబట్టి ఒక టీం దగ్గర నుండి మరో టీం పిల్లోస్ ను లాక్కొని దాచుకోవాలి. ఉమాదేవి, జెస్సీ, రవి, కాజల్‌, మానస్‌, సన్నీ, లహరి, నటరాజ్‌, శ్వేత లు ఉల్ఫ్ టీమ్ లోఉండగా.. యానీ మాస్టర్‌, లోబో, హమీదా, ప్రియ, విశ్వ, సిరి, శ్రీరామ్‌, ప్రియాంక, షణ్ముఖ్‌ లు గద్ద టీం లో చేరారు. ఇక అసలు కథ షురూ అయింది.

ఒకర్ని మించి ఒకరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ చేస్తున్నారు.  శ్వేత వర్మ అయితే చిన్న విషయానికే అరచి గగ్గోలు పెడుతూ ఎదుటి వారిపై విరుచుకుపడుతున్న విధానం ఆస్కార్ అవార్డ్ కోసమో ఏమో గానీ పర్ఫామెన్స్ మాత్రం పీక్స్ లో ఉంటోంది. నిన్నటి ఎపిసోడ్ లో కూడా గేమ్ ను ఆమె కసిగా, ఎదుటి వారిని మసి చేసైనా గెలవాల్సిందే అని ఆడిన విధానం చూస్తే వామ్మో ఇది ఒలంపిక్స్ ఏమో అన్న అనుమానం ప్రేక్షకుడికి వచ్చిందంటే నమ్మండి. ఇక సిరి అయితే ఈ టాస్క్ గెలవకపోతే హౌస్ నుండి ఇప్పుడే ఎలిమినేట్  అవుతాం అన్న రేంజ్ లో పరుగులు తీస్తోంది. ఇక ఉమాదేవి సిరి వద్ద నుండి పిల్లోస్ లాక్కొనే సమయంలో కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా కొడుతున్నారు అంటూ అరచి గందరగోళం చేసింది.

ప్రియ సిరిని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. మరో వైపు ఉమాదేవి ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు నేను పిల్లోని లాక్కున్నాను అంతే ఎవరి పైన దాడి చేయలేదంటూ గొడవకు దిగారు. కానీ యానీ మాస్టర్ నూ నీ టీ షర్ట్ చించి అయినా పిల్లౌస్ తీసుకుంటాను అన్న మాటలు చాల దారుణంగా ఉన్నాయి. ఒక సాటి మహిళా అనాల్సిన మాటలు అవేనా అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హౌస్ లో ఉమాదేవి ఆగడాలు రోజు రోజుకీ మరీ దారుణంగా ఉంటున్నాయి. ఇంతలో హౌస్ లో అది టాస్క్ అయినా సరే హింసకు తావు లేదంటూ ఇంటి సభ్యులను ని కూల్ చేసి ఎవరి టీమ్ ప్లేస్ లోకి వెళ్లాలని బిగ్  బాస్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: