ఇటీవల జీ తెలుగులో ప్రసారం అవుతున్న వైదేవి పరిణయం సీరియల్.. ప్రేక్షకులలో మంచి జనాదరణ పొందుతోంది.. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఆడియన్స్ నుంచి ఆదరణ పొంది, మంచి టీఆర్పీ రేటింగ్ ను కూడా సాధిస్తోంది ఈ సీరియల్.. సీరియల్ లో కూడా ఎంతోమంది నటీనటులు తమ అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. ఈ సీరియల్ లో హీరోయిన్ గా చేస్తున్న వైదేహి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది..

ఇక వైదేహి పరిణయం హీరోయిన్ వైదేహి  అసలు పేరు యుక్త మల్నాడ్..ఈమెను ప్రిన్సి అని ముద్దుగా కూడా పిలుస్తూ ఉంటారు.. 1996 జూలై లో కర్ణాటకలోని చిక్ మంగళూరు లో జన్మించిన ఈమెకి , ప్రస్తుతం 26 సంవత్సరాలు.. ఇక తన విద్యాభ్యాసాన్ని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్లో పూర్తి చేసి,  బెంగళూర్ యూనివర్సిటీ బీకాం కంప్యూటర్స్ కూడా పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అన్న, డాన్స్ అన్న బాగా ఇష్టం ఉండడంతో వాళ్ళ నాన్న ఈమెకు డాన్స్  నేర్పించాడు.. చిన్న వయసులో చదువుకునేటప్పుడు ఈమె కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని అక్కడ బహుమతులు కూడా గెలుచుకుంది..

ఇక డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఎయిర్ హోస్టెస్ కోర్సు చేసి, జాబు కూడా వచ్చింది. కానీ నటన మీద ఇంట్రెస్ట్ తో ఉద్యోగానికి రాజీనామా చేసి షార్ట్ ఫిలిం లు, కవర్ సాంగ్స్ లో కూడా నటించింది. తమిళం , మలయాళం లో  పాటలకు కూడా కొరియోగ్రాఫర్ గా పనిచేసింది.. 2015 వ సంవత్సరములో  టైటిల్ విన్నర్ గా మిస్ మల్నాడ్ నిలిచింది. ఈమె కన్నడ  మూవీస్ తో  పాతు సీరియల్స్లో కూడా చేసిన ఈమె తెలుగులో వైదేహి పరిణయం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు పొంది, హైదరాబాదులో ఒక ఖరీదైన నివాసాన్ని తీసుకొని ,అందులో జీవిస్తోంది. వీళ్ళకి ఒక కారు కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: