బెలూన్స్ ను పెట్టి పక్కనే ఓ చైర్ వేశారు. ఒక్కొక్క కంటెస్టెంట్ ఓ బలూన్ తీసుకుని దాని పై వారు ఫస్ట్ లవ్ చేసిన వ్యక్తి పేరు రాసి..అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని వారికి సంబంధించిన తీపి జ్ఞాపకాలను పంచుకోవాలి. అయితే అలా ఒక్కొక్కరు తమ తమ ఫస్ట్ లవ్ విషయాలను షేర్ చేసుకుంటుండగా....ప్రియాంక తన జీవితంలో జరిగిన ఓ విషాద గాథను చెబుతూ ఎమోషనల్ అయ్యింది. జెండర్ మార్చుకున్న తను రవి అనే వ్యక్తిని ప్రేమించింది అని, అతడు కూడా తనని ఎంతగానో ప్రేమించాడు అని చెప్పుకొచ్చింది. అలా మేమిద్దరం ప్రేమలో పూర్తిగా మునిగిపోయాం. ఒకరోజు రవి వచ్చి నాకు మా వాళ్ళు పెళ్లి సంబంధం చూశారు. త్వరలో పెళ్లి అని షాక్ ఇచ్చాడు. అపుడు షాక్ అయ్యాను.
ఏంటి రవి నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవా అని అడిగితే, నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వు ఏమైనా పూర్తిగా అమ్మాయివా...నీకేమైనా పిల్లలు పుడతారా , పెళ్లి లేదు ఏమి లేదు ఇది జస్ట్ టైం పాస్ నువ్వు ఎంజాయ్ చేశావ్. నేను ఎంజాయ్ చేశాను అంతే అని వెళ్ళిపోయాడు. పిల్లల విషయం కోసం నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను..ఎంతో డబ్బులు ఖర్చు చేశాను...అలా నా రవి నాకు దూరమయ్యాడు అంటూ బోరున ఏడ్చింది ప్రియాంక.
సిరి కూడా తను మొదట ప్రేమించిన వ్యక్తి చనిపోయాడంటూ ఎమోషనల్ అయ్యింది. ఇలా ఒక్కొక్కరు తమ ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు.