
ధరణి అందంతో.. అమాయకపు నటనతో అభిమానులను బాగా అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.. ఇకపోతే ఈమె కేవలం మా టీవీ లో నే కాకుండా ఈ టీవీ లో కూడా పలు సీరియల్స్ లో నటించిన విషయం అందరికీ తెలిసిందే..ఇక ఈమె పూర్తి పేరు జ్యోతి.. తెలుగు అమ్మాయి.. అందం ,అభినయంతో, అణకువ కలిగిన వదిన పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోంది.. జ్యోతి.. అక్టోబర్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో జన్మించింది..
చిన్నప్పటినుంచి నటించడం అంటే ఈమెకు చాలా ఇష్టమట. ఈ కారణంతోనే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి, ఆ తర్వాత సీరియల్స్ లోకి ప్రవేశించింది.. 2004వ సంవత్సరంలో మంచు మనోజ్ హీరోగా సదా హీరోయిన్ గా తెరకెక్కిన దొంగ దొంగది సినిమాలో కూడా జ్యోతి నటించి, మంచి గుర్తింపు పొందింది.. ప్రముఖ సీరియల్ నటుడు జాకీ కూడా నటించిన ఈ తీర్పు ఇల్లాలిది అనే సినిమాల్లో కూడా ఈమె నటించింది.. అమెరికా అమ్మాయి , మీనాక్షి వంటి పలు సీరియల్స్ లో నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.. 2014వ సంవత్సరంలో ఈమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా లభించింది.. ఇకపోతే జ్యోతి మరిన్ని అవకాశాలను పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.