ఇక అబ్బాయిలు కూడా ఈ సీరియల్ చూసి అందులో ముఖేష్ గౌడ స్టైల్ ని ఫాలో అవుతున్నారు. ఇకపోతే ముఖేష్ గౌడ ఇదివరకే ఈటీవీ లో ప్రసారం అయిన ప్రేమ్ నగర్ సీరియల్ లో హీరో గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ అందుకున్న ముఖేష్ గౌడ ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఈ సీరియల్స్ ద్వారా ఎంతోమంది యువత బాగా కనెక్ట్ అయిన ముఖేష్ గౌడ గురించి ప్రస్తుతం చాలామంది బయోడేటా వెతుకుతున్నారు.
ముఖేష్ గౌడ హిందూ కుటుంబం.. కర్ణాటకలో స్థిరపడిన కుటుంబంలో జన్మించాడు. ఇక ఇతని గ్రాడ్యుయేషన్ మైసూరులోని ఒక విశ్వవిద్యాలయం లో పూర్తి చేశాడు. ముఖేష్ గౌడ నటన మీద ఆసక్తితో కాలేజీ చదువుతున్న సమయంలోనే మోడల్ గా తన వృత్తిని ప్రారంభించాడు. కానీ నటనే తన జీవిత వృత్తి చేసుకోవడం కోసం ఎన్నో ఆడిషన్స్ కి తిరిగి చివరికి సీరియల్స్ లో అవకాశం దక్కించుకుని , ప్రస్తుతం యువతను బాగా ఆకట్టుకున్నాడు.. అవకాశం వస్తే సినిమాలలో కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు ముఖేష్ గౌడ. అయితే త్వరలోనే ముఖేష్ గౌడ కు కనీసం చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం ఏమైనా సినీ ఇండస్ట్రీలో వస్తే , ఆయన తన ప్రతిభతో మంచి గుర్తింపు పొందుతారు అని కూడా అభిమానులు ఆశిస్తున్నారు.