దుర్గా రావు దంపతులు టిక్ టాక్ ద్వారా తమ కెరీర్ ను స్టార్ట్ చేసి , ప్రస్తుతం రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశం దక్కించుకున్నారు. వీళ్లు నాది నక్కిలీసు గొలుసు అనే పాట తో బాగా పాపులారిటీని అందుకున్నారు.. టిక్ టాక్ యాప్ లో వీరు చేసిన డాన్స్ లకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదనే చెప్పాలి.. నాది నక్లెస్ గొలుసు అనే పాటే దుర్గారావు ను స్టార్ గా చేసింది అని కూడా చెప్పవచ్చు.. దుర్గారావు మాత్రమే కాదు దుర్గా రావు భార్య కూడా తనతో పాటే యాక్టింగ్ చేస్తూ ఎన్నో సన్నివేశాలను ఎంతో ఫన్నీగా చేయడంలో ఆమెకు ఆమే సాటి..భార్యాభర్తలిద్దరూ టిక్ టాక్ వీడియో లు చేస్తూ మంచిగా అభిమానులను సంపాదించుకున్నారు.. సోషల్ మీడియా ద్వారా మొదలైన వీరి ప్రయాణం ప్రస్తుతం టీవీ చానల్స్ తో పాటు సినిమాలలో కూడా చేసే స్థాయికి చేరుకోవడం గమనార్హం.. ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం  సుడిగాలి సుధీర్ , రవి అని చెబుతూ ఉంటారు. దుర్గారావు మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ చేశామని తెలిపిన ఈయన,  మేము ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చాము అంటే అందుకు కారణం సుధీర్ అని.. సుధీర్.. దుర్గా రావు గారికి మంచి ఛాన్స్ ఇవ్వండి అంటూ అందరికీ చెప్పారని కూడా తెలిపాడు..మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం సుడిగాలి సుధీర్ కారణం అని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా దుర్గారావు తెలియజేశారు.. నేను ఎప్పుడైనా క్యారవాన్ లోకి వెళ్తే సార్ అంటూ పలకరిస్తారు అని కూడా తెలిపాడు దుర్గారావు.. ఇక మా ఇద్దరిని తల్లిదండ్రులు గా భావించి, మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు సుధీర్ అని తెలిపాడు దుర్గారావు. ఇక ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేస్తున్న యాంకర్ రవి కి తమ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఎందుకంటే వీరు ఏ షో కి వెళ్ళినా కూడా బాగా సపోర్ట్ చేస్తాడట. ఇంట్లో మనిషిలాగా చూస్తారని , అందుకే వారు రవికి సపోర్ట్ చేస్తామని తెలిపారు.. ఆయన తన అభిమానులను కూడా రవి కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: