శ్వేత, హమీద, శ్రీ రామ్, లోబో, యాని మాస్టర్ , యాంకర్ రవి, విశ్వ ఇలా దాదాపుగా అందరూ కాజల్ నే వరెస్ట్ పర్ఫార్మర్ గా తెలిపారు. దాంతో కాజల్ కూడా ఇంత మంది దండయాత్ర చేయడం ఏం బాగోలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ విషయం అలా ఉంచితే ప్రియాంక సింగ్ కి మానస్ కి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. మొదటి నుండి ప్రియాంక కి మానస్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఉందని తెలిసిందే. ఓ సారి ప్రియాంక మాట్లాడుతూ నేను హౌస్ లో ఎవరికైనా రాఖీ కడతాను. కానీ నీకు మాత్రం అసలు కట్టను అంటూ మానస్ కు చెప్పింది.
ఇక నిన్నేమో ప్రియ ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ కాగా.. కెప్టెన్సీ టాస్క్ లో మాకు సపోర్ట్ చేయలేదంటూ తెగ ఫీల్ అయ్యారు సన్ని, మానస్. అంతేకాదు మానస్ అయితే ఏడ్చేశాడు కూడా. దాంతో ప్రియాంక గోరు ముద్దలు కలిపి మానస్ కి నచ్చ చెప్పి అన్నం తిని పెంచడానికి ప్రయత్నించగా.. మానస్ పింకీతో కటువుగా మాట్లాడటంతో ఆమె కూడా ఏడ్చేసింది. తనని అర్దం చేసుకోలేదని ఫీల్ అయినట్లుంది పింకీ. మరి తర్వాత అయిన ఫీల్ అయిన పింకీని మానస్ ఓదారుస్తాడేమో చూడాలి. వీరి మధ్య ఏదో తెలియని ప్రేమ బంధం పెనవేసుకుపోతోంది. మరి ముందు రోజుల్లో ఏమి జరగనుందో చూడాలి.