ఇక ఈమె ప్రస్తుతం దేవత సీరియల్ లో ప్రధాన భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా రాధగా తన కూతురితో బ్రతుకుతున్న ఆమె మళ్ళీ ఆదిత్యకు దగ్గర అవుతుందా లేదా.. మళ్ళీ ఆదిత్య జీవితంలోకి రుక్కు కనుక ప్రవేశిస్తే సత్య పరిస్థితి ఏంటి.. ఆ క్యారెక్టర్ కు ఎలా న్యాయం చేస్తారు లేదా ఎలా ఎండ్ చేస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంకో వారంలో రాధగా బ్రతుకుతున్నది రుక్మిణి నే అని దేవుడు అమ్మతో సహా అందరికీ తెలిసిపోనుందట..ఆ తర్వాత రుక్కు మాధవ్ ని నిజంగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనింది అని అంత అపార్థం చేసుకొని అందరూ నిందలు వేస్తూ దూషిస్తారట.
ఇలా ఒక రెండు మూడు నెలలు పాటు సీరియల్ సాగనుందని సమాచారం. ఆ తర్వాత రుక్మిణి అసలు మాధవ్ ని పెళ్లి చేసుకోలేదని దేవి ఆదిత్య బిడ్డే అని రంగ..రమ్యలు ద్వారా అసలు నిజం బయటపడనుందని తెలుస్తోంది. ఇక అక్కడి నుండి కథని మళ్ళీ ఎలా మలుపు తిప్పుతారో చూడాలి. అయితే కథలో ఎన్ని మలుపులున్నా కానీ ఆదిత్య రుక్మిణికి దగ్గరయితే చాలని కొందరు అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి రుక్మిణి పాత్రణలు మాత్రం డైరెక్టర్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాడు.