
వీరిద్దరూ హౌస్ లో ఎంతో ప్రేమగా ఉంటూ వచ్చారు. ఒకరికొకరు తోడుగా నీడగా రియల్ లైఫ్ లో ఎలా అయితే ఒకరి కోసం ఒకరు జీవిస్తారో అదే అనుభూతిని కలిగించారు ఈ జంట. కానీ ఆమె వెళ్ళాక శ్రీరామ చంద్ర లో ఎదో తెలియని మార్పు వచ్చింది. ఇది ఇంటి సభ్యులు మరియు ప్రేక్షకులు అందరికీ అర్థమయింది. హమీదా తో శ్రీరామ్ కు ఉన్న అటాచ్మెంట్ కారణంగా ఆమె లేని బిగ్ బాస్ ఇంట్లో మునుపటిలా ఉండలేక, గేమ్ ను సరిగా ఆడలేక ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడూ అందరితో సంతోషంగా ఉండే సింగర్ శ్రీరామ్ ఇప్పుడు ఎంతో నిరాశగా కనిపిస్తున్నాడు. శ్రీరామ్ అభిమానులు సైతం ఎంతో బాధపడుతున్నారు.
కేవలం హామీదా ఎలిమినేషన్ శ్రీరామ్ లో ఎంత మార్పుకు కారణమయింది అంటే ఇది ఒక మనిషిని ప్రేమ ఎంతలా మార్చగలదో అన్న దానికి ఉదాహరణగా చెప్పుకోవాలి. అందుకే బిగ్ బాస్ హౌజ్ లో రిలేషన్స్ పెట్టుకోవద్దు. గేమ్ మాత్రమే ఆడాలని తెలుసుకోవాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ముందు ముందు అయినా శ్రీరామ్ ప్రవర్తనలో మార్పు రావాలని ఆశిద్దాం.