అక్టోబర్ 13వ తేదీన పల్లవి రామిశెట్టి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ లో జన్మించింది. పల్లవి తండ్రి పేరు నాగేశ్వరరావు రామిశెట్టి.. తల్లి పేరు లలిత. పల్లవి ఈమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. ఇక పల్లవి ఒక కూతురు కాబట్టి తల్లిదండ్రుల గారాబం చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి . చదువు విషయానికి వస్తే, హైదరాబాద్‌లోని తన విద్యను మొత్తం పూర్తి చేసింది. సోషియాలజీ ను పూర్తిచేసిన పల్లవికి చిన్నప్పటినుంచి నటన మీద ఆసక్తి ఎక్కువ. అంతేకాదు సింగర్ గా కూడా ఈమె స్కూల్ అలాగే కాలేజీ డేస్ లో కూడా ఎన్నో బహుమతులను గెలుచుకుంది.
పల్లవి మొదట రంగుల కల అనే షో ద్వారా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టింది. తర్వాత ఈ టీవీలో ప్రసారమైన భార్యామణి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది పల్లవి. అంతేకాదు ఈ సీరియల్ లో నటించిన తనకు నంది అవార్డు కూడా లభించడం గమనార్హం. ఆడదే ఆధారం, మాటేమంత్రం, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2019 మే 23వ తేదీన దిలీప్ కుమార్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది. పల్లవి భర్త హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.