
అస్సలు ఎవరు ఈ ఎలిమినేషన్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే విశ్వ మొదటి నుండి స్ట్రాంగ్ కంటిస్టెంట్, ఫిజికల్ అయినా మెంటల్ గా అయినా గట్టి పోటీ ఇచ్చేవాడు. ఇంట్లో అనవసరంగా గొడవలకి పోడు, అలాగే తనదాక వస్తే ఊరుకోడు. అలాంటిది అంత పర్ఫెక్ట్ గా ఉన్న విశ్వనే ఎలిమినేట్ అవ్వడం ప్రజలతో పాటు ఇంటి సభ్యులను కూడా ఆశ్చర్యపరిచింది. హౌజ్ లో అని మాస్టర్, రవి, శ్రీరామ్ మరియు సిరి అందరూ కూడా ఇంత స్ట్రాంగ్ ఇంటి సభ్యుడు ఎలిమినేట్ అయ్యాడు అంటే..ఆశ్చర్యం గా ఉంది అంటూ షాక్ అయ్యారు. అసలు అందరి దృష్టిలో టాప్ ఫైవ్ లో ఉన్న విశ్వ ఎలిమినేట్ అవ్వడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక విశ్వ కి రెమ్యునరేషన్ విషణికొస్తే...స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న పేరుతో పాటు పారితోషకం కూడా బాగానే స్ట్రాంగ్ గానే తీసుకున్నారట విశ్వ. రోజుకు లక్ష వరకు ఈయన అందుకున్నట్లు సమాచారం. అంతే కాదు ఎలిమినేట్ అయ్యే సమయంలో తను పెంచుకున్న క్రేజ్ ను బట్టి పారితోషకాన్ని డబుల్, త్రిబుల్ పెంచి ఇచ్చిపంపిస్తామని ముందుగానే యాజమాన్యంతో డీల్ అయినట్లు చెబుతున్నారు. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ విశ్వ ఎలిమినేషన్ అందులోనూ లాస్ట్ లో కాజల్ ఉండగా తను కాకుండా విశ్వ ఎలిమినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.