అయితే ఈమె ఇంటి నుండి వెళ్లిపోవడానికి పలు స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నట్లు సమాచారం. వాటిలో ముఖ్యంగా కాజల్ ని, సన్ని ని చులకన చేసి మాట్లాడుతూ ఉండటం. కాజల్ ని ఎప్పుడూ కూడా వెక్కిరిస్తూ ఉండటం. మొదట్లో గ్రూప్ లు గా అడుతున్నారంటూ ఇలా ఉంటే వ్యక్తిగతంగా ఆడే నాలాంటి వారు ఎప్పటికీ కెప్టెన్ అవ్వలేరంటూ, సన్ని, కాజల్, మానస్ గ్రూప్ ని అలాగే జెస్సీ, షన్ను, సిరి గ్రూప్ లను ఉద్దేశిస్తూ చేస్తూ మాట్లాడే ఆనీ మాస్టర్ ఈ మధ్య సిరి వాళ్ళ గ్రూప్ లో ఒకరిగా కలసి పోయి సన్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడంతో ఆమె కాస్త నెగెటివిటీని మూటకట్టుకున్నట్లు తెలుస్తోంది.
అలా ఇవన్నీ కలిసి ఆమె హౌజ్ లో నుండి ఎలిమినేట్ అయ్యేందుకు కారణమయ్యాయని చెబుతున్నారు. ప్రచారానికి తగినట్లే జరుగుతుందా లేదా గత వారం లాగా బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా అన్నది చూడాలి. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి. ఈ ఎలిమినేషన్ హౌస్ ల ఉన్న మిగతా వారికి ఒక గుణపాఠం కానుంది.