
ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ఉంది, ఎవరి ఫ్యాన్స్ వారి అభిమాన ఇంటిసభ్యుడు టైటిల్ గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వే సీజన్ ఫైవ్ టైటిల్ తీసుకెళ్లేది ఎవరన్నది పక్కా లెక్కలతో సహా క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు ఇంతకీ ఆ బిగ్ బాస్ సెలబ్రిటీ ఎవరు, అలాగే టాప్ ఫైవ్ లో ఉండబోయేది ఎవరన్నది కూడా రివీల్ చేసేసింది. ఇంతకీ ఆ వివరాల్లోకి వెళితే...
అనేక మంది బిగ్ బాస్ షో ప్రేక్షకుల అభిప్రాయాలు కలెక్ట్ చేసిన ఆ సంస్థ అన్ని గణాంకాలను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నది క్లారిటీ ఇచ్చింది. కాగా ఈ సర్వే ప్రకారం సన్నినే బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ ను సొంతం చేసుకుంటాడట. మెజారిటీ ఆడియన్స్ అతడికి మా ఓటు... సన్ని నే విన్నర్ అంటూ అంటూ తేల్చి చెప్పారట.
సన్ని తర్వాత బిగ్ బాస్ టైటిల్ గెలిచే ఛాన్స్ శ్రీ రామ చంద్రకు ఉందని ప్రేక్షకులు తమ అభిప్రాయం వెల్లడించినట్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు సన్ని టంగ్ స్లీప్ అవుతాడు. కానీ అతడి కోపంలో న్యాయం ఉంది. కావాలనే అతడు బరస్ట్ అయ్యే వరకు మిగిలిన వారు రెచ్చగొడుతూ ఉన్నారు.
అప్పటి వరకు వారు మాట్లాడిన పిచ్చి మాటల్ని ఎవరు కౌంట్ చేయడం లేదు. కానీ లాస్ట్ సన్ని అనే ఒక్క మాట హైలెట్ చేసేస్తుంది సిరి మరియు షన్ను. కాబట్టి ఆ విషయం బయట ఆడియన్స్ కు క్లియర్ గా కనిపిస్తోంది. సో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ మాత్రం సన్ని నే అంటున్నారట. ఇక రవి కి ఆడియన్స్ థర్డ్ ప్లేస్ ను ఇచ్చారు. ఇలా ఆ తర్వాతి స్థానంలో షన్నుకి మెజారిటీ రాగా టాప్ ఫైవ్ లిస్ట్ లో ఫిఫ్త్ ప్లేస్ లో మానస్ కి స్థానం ఇచ్చారు ఆడియన్స్.