ఇది బాగానే ఉంది కానీ.. మరి శ్రీ ముఖి సంగతి ఏంటి అనుకుంటున్నారా..!! శ్రీ ముఖితో కలిసే రవి కూడా యాంకరింగ్ చేయనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఈటివి ప్లస్ లో వచ్చిన పటాస్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. వీరి కాంబోకి మంచి క్రేజ్ ఉంది. అయితే ఇపుడు అదే మ్యాజిక్ ను స్టార్ మా లోనూ అప్లై చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. స్టార్ మా లో కామెడీ స్టార్స్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కానీ...అందుకు రవి తోడైతే రేటింగ్స్ మరింత పెరుగుతాయని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ షో కు పలు యాంకర్లు వచ్చారు, వెళ్ళారు. చివరికి శ్రీ ముఖి సెటిల్ అయ్యింది. మరి శ్రీ కి తోడుగా యాంకరింగ్ చేసి కామెడీ జోరు పెంచేందుకు యాంకర్ రవి రంగంలోకి దిగుతాడేమో చూడాలి. అన్నీ కలిసొచ్చి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇకపై కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో శ్రీ తో పాటు రవి ను కూడా స్టేజ్ పై చూడొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.