
అతడి క్రేజ్ మరింత రెట్టింపు అయింది. కాగా ఇపుడు ఈ సక్సెస్ఫుల్ జంట కలిసి త్వరలో ఓ కొత్త ప్రోగ్రాంతో మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగియనున్న నేపథ్యంలో ఓ కొత్త డ్యాన్స్ ప్రోగ్రామ్ ను మన ముందుకు తీసుకు రానుందట స్టార్ మా. కాగా ఆ షోకి యాంకరింగ్ చేసేందుకు రవి , శ్రీ ముఖి లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డ్యాన్స్ షో అంటే ఆల్మోస్ట్ హిట్ ప్రోగ్రామ్ అనే చెప్పాలి. గతంలో వచ్చిన చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గొప్ప ఫలితాన్ని అందుకున్నాయి.
ఈ షో కూడా అదే తరహాలో విజయాన్ని అందుకుంటుంది అని ఆశిస్తున్నారు. స్టార్ మా లో డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఈ క్రమంలో త్వరలో డ్యాన్స్ షో అన్న వార్త అందరిలోనూ ఊపు తెస్తోంది. అందులోనూ రవి, శ్రీ ముఖి మరోసారి కలసి యాంకరింగ్ చేయబోతున్నారు అంటే ప్రేక్షకుల దూకుడు మరింత పెరిగింది. కానీ ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ మాత్రమే. ఈ వార్తపై త్వరలోనే అధికారిక వార్త వస్తుందని ఆశిద్దాం.