అంతేకాకుండా సత్య, ఆదిత్య కలిసిపోవడం పట్ల కూడా చాలా మంది ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూతురు ఉన్న రుక్మిణి , ఆదిత్యలు కలవడమే న్యాయం అంటున్నారు. చాలామంది ఇదే విషయాన్ని కామెంట్లు పెడుతున్నారు. ఈ సీరియల్ లైన్ ని కాస్త మార్చండి డైరెక్టరు సార్ కావాలంటే సత్య క్యారెక్టర్ ని ఎండ్ చేసేయండి అంటూ సోషల్ మీడియా వేదికపై రిక్వెస్ట్ లు పెడుతున్నారు. సీరియల్ ను అయితే రెగ్యులర్ గా చూస్తున్నారు. కానీ అంతగా ఆసక్తికరంగా మనసుకు దగ్గర కావడం లేదు అంటూ వాపోతున్నారు. మా ఫేవరెట్ సీరియల్ ని మాకు నచ్చినట్లు కాస్త మార్పులు చేయండి అంటూ చెబుతున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. కాగా ఇలాంటి సమయంలో సత్య పాత్రలో ఇప్పటి వరకు నటించిన వైష్ణవిని తొలగించి శుక్రవారం ఎపిసోడ్ లో సత్య పాత్రలో మరో కొత్త అమ్మాయిని పరిచయం చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఎందుకిలా మార్చారు అంటూ తలలు పట్టుకుంటున్నారు.
అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఒకటి ప్రేక్షకుల విన్నపం మేరకు సత్య పాత్రను త్వరలో తొలగించడానికే ఈ కొత్త అమ్మాయిని ప్రవేశ పెట్టి ఉంటారని సమాచారం. ఎందుకంటే ఇన్నాళ్లు సత్యగా చేసిన వైష్ణవి పాత్రను అర్ధాంతరంగా ముగించడం అంటే సత్యకు అన్యాయం చేసినట్లే. దాంతో ఆమె ఫ్యాన్స్ హార్ట్ అవుతారు. అలా కాకుండా ఉండేందుకే కొత్త అమ్మాయిని ప్రవేశపెట్టి త్వరలో ఆ పాత్రను ఎండ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్. ఇది కొందరి అంచనా మాత్రమే. అయితే ఇది నిజంగా చాలా బాగుంది. కానీ సీరియల్ ను ఎటు తిప్పినా రుక్మిణి, ఆదిత్య లను మాత్రం ఒక్కటి చేయండి. దేవి కి తన కన్న తండ్రి ప్రేమ దక్కేలా చేయండి అంటూ దేవత సీరియల్ ఫాన్స్ బాగా ఎమోషనల్ అవుతున్నారు.